ఏం చేస్తాం.. కొన్ని కొన్ని సార్లు అభిమానులు గుండె రాయి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.ఒక్కో టైం లో ఒక్కో హీరో అభిమానులు అలాంటి పరిస్థితులని ఎదుర్కుంటారు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (ram charan)అభిమానుల వంతు వచ్చింది. అసలు విషయం ఏంటో చూద్దాం.
చరణ్ అప్ కమింగ్ మూవీ గేమ్ చేంజర్(game changer)పొలిటికల్ నేపధ్యంతో తెరకెక్కుతుంది. ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ శంకర్ (shankar)దర్శకుడు. దీంతో అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. 2021 లోనే షూటింగ్ ప్రారంభం అయ్యింది. కొంత భాగం జరిగిన తర్వాత భారతీయుడు 2 కి శంకర్ వెళ్లిపోవడంతో బ్రేక్ పడింది. ఇక అప్పట్నుంచి రకరకాల కారణాల వల్ల షూటింగ్ లేట్ అవుతు వచ్చింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఒక రేంజ్ లో తమ అసహనాన్నివ్యక్తం చేసారు. కానీ ఎట్టకేలకు ఇప్పుడు తుది దశకు చేరుకుంది. ఇక అసలు విషయానికి వస్తే ఇటీవల శంకర్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో మాట్లాడుతు గేమ్ చేంజర్ కి రెండవ పార్ట్ ఉండదు. ఎందుకంటే స్టోరీ కి ఆ స్కోప్ లేదని చెప్పుకొచ్చాడు. అదే విధంగా ఇంకొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసాడు.
ఇంకో పది రోజులు షూటింగ్ చేస్తే మూవీ కంప్లీట్ అవుతుంది. భారతీయుడు 2 రిలీజ్ అయ్యాక షూటింగ్ ని స్టార్ట్ చేస్తామని చెప్పాడు. దీంతో అంత్య నిష్టురం కంటే ఆది నిష్టురం మేలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ముందు మూవీ రిలీజ్ అయితే చాలని అనుకుంటున్నారు. మిగతా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని దీపావళి లేదా క్రిస్మస్ కి గాని వచ్చే అవకాశాలు ఉన్నాయి. మేకర్స్ అయితే డేట్ విషయంలో ఎలాంటి అధికార ప్రకటన ఇవ్వలేదు. చరణ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జట్ తో హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. కియారా అద్వానీ, అంజలి, ఎస్ జె సూర్య, సముద్ర ఖని, నవీన్ చంద్ర, సునీల్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. చరణ్ డ్యూయల్ రోల్ అనే టాక్ ఎప్పటినుంచో వినిపిస్తుంది.