Top Stories

రాహుల్ పై బిజెపి అనైతిక, లేకి ప్రచారం!


భారతీయ జనతా పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది. సోషల్ మీడియా విచ్చలవిడితనం పెరిగిన తర్వాత.. తమకు కిట్టని వారిపై థర్డ్ రేట్ గ్రాఫిక్స్ తయారుచేసి వారి మీద బురద చల్లడానికి అలాంటి మార్ఫింగ్ ఇమేజెస్ ను పోస్టులుగా పెట్టి.. ఒక హేయమైన దిగజారుడు పనులు చేసేవారు ఎక్కువయ్యారు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అలాంటి దిగజారుడు రాజకీయాలను స్వయంగా ఎండార్స్ చేస్తున్నది.

రాహుల్ గాంధీ ని రావణుడిలాగా పది తలలతో వికృతంగా మార్ఫింగ్ ఇమేజ్ ను తయారు చేసి భారతీయ జనతా పార్టీ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘‘నవతరం రావణాసురుడు ఇదిగో ఇక్కడ ఉన్నాడు. అతడు దుర్మార్గుడు, ధర్మ వ్యతిరేకి, రాముడి ద్వేషి. భారతదేశ వినాశనమే అతని లక్ష్యం’’ అంటూ సదరు పోస్టుకు భాజపా టైటిల్ గా పెట్టింది.

ఇలాంటి నీచమైన మార్పింగ్ ఫోటోలతో బిజెపి కార్యకర్త ఎవరైనా ఒక పోస్ట్ పెట్టి ఉన్నా, ఒక ఫ్లెక్సి పోస్టరు వేసి ఉన్నా.. క్షమించి వదిలేయవచ్చు. జనంలో ఉండే లేకి పర్వర్టెడ్ బుద్ధులు ఇలాంటి ప్రచారాలను ప్రేరేపిస్తాయని అనుకోవచ్చు. కానీ, భారతీయ జనతా పార్టీ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి ఇలాంటి పోస్టును ప్రచారంలో పెట్టడం బాలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఆ పోస్టరు కింద ‘రావణ్- కాంగ్రెసు పార్టీ వారి నిర్మాణం- జార్జ్ సోరోస్ దర్శకత్వం’ అని పెట్టారు. జార్జ్ సోరోస్ అంటే ప్రఖ్యాత హంగేరియన్, అమెరికన్ వ్యాపారవేత్త. ప్రపంచ వ్యాప్తంగా అనేక గ్రూపులకు విరాళాలు ఇస్తూ, ఆ దేశాల అంతర్గత వ్యవహారాల్లో ఆయన జోక్యం చేసుకుంటారని భాజపా కొన్నాళ్లుగా ఆరోపణలు చేస్తోంది.

ఇలాంటి దారుణమైన గ్రాఫిక్ ఇమేజ్ తో చేసే దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోంది. వారు ఖండించడం సంగతి ఎలా ఉన్నా.. ఇలాంటి నీచమైన మార్ఫింగ్ ఇమేజెస్ తో దారితప్పుతున్న పెడపోకడల ప్రచారాలకు సాక్షాత్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీనే పాల్పడడం శోచనీయం అని ప్రజలు భావిస్తున్నారు.



Source link

Related posts

అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి.. జ‌నంలోకి జ‌గ‌న్‌!

Oknews

రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) సెన్సార్ పూర్తి

Oknews

తీవ్ర అసంతృప్తిలో వైసీపీ ఎంపీ అభ్య‌ర్థి.. త్వ‌ర‌లో!

Oknews

Leave a Comment