రికార్డు ముందు పుట్టిందా సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu)ముందు పుట్టాడా అనే డౌట్ చాలా మందిలో ఎప్పటి నుంచో ఉంది. ఆయన సినీ ట్రాక్ రికార్డు అలాంటింది మరి. ఇక మహేష్ ఎప్పుడో తన టక్కరి దొంగ(takkari donga)మూవీలో ఒక విషయం చెప్పేసాడు. నిండు చంద్రుడు ఒక వైపు చుక్కలు ఒక వైపు అని. ఇది నిజమని మరోమారు కళ్ళ ముందు ఒక సంఘటన ప్రత్యక్ష మయ్యింది.
అగస్ట్ తొమ్మిదిన మహేష్ పుట్టిన రోజు.ఆ వేడుకల్ని భారీగా నిర్వహిచడానికి వరల్డ్ వైడ్ గా ఉన్న మహేష్ ఫ్యాన్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఉత్సాహాన్ని డబుల్ చేయడానికి మహేష్ తన బర్త్ డే కానుకగా మురారి(murari)ని తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఈ మూవీ ఒక సంచలన రికార్డుని క్రియేట్ చేసింది. ఆన్ లైన్ లో ప్రీ సేల్స్ బుకింగ్ ఓపెన్ చెయ్యగా సుమారు కోటి రూపాయల దాకా వసూళ్ళని రాబట్టింది. ఎప్పుడో 22 ఏళ్ళ క్రితం వచ్చిన మూవీ ఈ స్థాయిలో టికెట్స్ బుక్ చేసుకొవడం ఒక అరుదైన రికార్డుగా భావించవచ్చు. ఇక ఆ స్థాయి రెస్పాన్స్ తో మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. బాబు ల్యాండ్ అయితే ఇలాగే ఉంటుందని మాకు ఎప్పుడో తెలుసంటున్నారు. అదే విధంగా రిలీజ్ రోజు మరిన్ని రికార్డులు సృష్టిస్తుందనే నమ్మకాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.
ఇక మురారి మూవీ 2001 లో వచ్చి అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయం సాధించింది. అనేక చోట్ల థియేటర్ టౌన్ అండ్ జిల్లా రికార్డులని కూడా నమోదు చేసింది. మరణాన్ని జయించే పోరాటయోధుడిగా, ప్రేమికుడిగా, కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తిగా మహేష్ నటన శిఖరాగ్ర స్థాయిలో ఉంటుంది. సోనాలి బింద్రే హీరోయిన్ కాగా కైకాల సత్యనారాయణ, లక్ష్మి, ప్రసాద్ బాబు, నాగబాబు, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటించారు. కృష్ణ వంశీ దర్శకుడు కాగా రామ్ ప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై నందిగం రామలింగేశ్వరరావు నిర్మించాడు.