గురు, శివలింగ, నీవెవరో సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమైంది రితికా సింగ్. మాధవన్ హీరోగా ‘ ఇరుదుసుట్రు’ మూవీతో కోలివుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన భామ.
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం పొందిన రితికా సింగ్.. ‘గురు’ మూవీలో వెంకటేశ్ తో కలిసి మంచి నటన పరంగా నేచురల్ గా చేసి విమర్శకుల ప్రశంసలు పొందింది. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘వేట్టైయాన్’ లో రితికా సింగ్ యాక్షన్ రోల్ లో కనిపించనుంది. రితికా సింగ్ ప్రధాన పాత్రలో నటించిన హరర్ మూవీ ‘వళరి’. ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఇది థియేటర్లలో రిలీజ్ అవ్వకుండా డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నట్టు ఈ మూవీ మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు.
తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్ లో మార్చి 6 వ తేదీ నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్నట్టు తెలుస్తోంది. ‘వళరి’ మూవీలో రితికా సింగ్ తో పాటు శ్రీరామ్ ముఖ్య పాత్రలో కన్పిస్తున్నట్టు సమాచారం. కెప్టెన్ నవీన్ నాయుడుగా శ్రీరామ్ కన్పిస్తున్నట్టు ఈ మూవీ మేకర్స్ తెలియజేసారు. శ్రీరామ్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని చిత్రబృందం విడుదల చేసింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ని విడుదల చేయగా.. ఇందులో రితిక ధీనంగా పడిపోయి ఉంది. తన వెనకాల ఓ పాప జుట్టు విరబూసుకొని భయంకరంగా కనిపిస్తుంది. అయితే ఈ సినిమా ట్రైలర్, టీజర్ ని త్వరలో విడుదల చేయనున్నట్లు వళరి నిర్మాణ సంస్థ తెలిపింది. అయితే రితికా కెరీర్‌లో ఈ సినిమా సక్సెస్ అవ్వనుందా లేదా తెలియాలంటే మరికొన్ని ఆగాల్సిందే.