Top Stories

రిపబ్లిక్ డే కానుకగా సీనియర్ హీరో సినిమా


లెక్కప్రకారం పొంగల్ కు రావాలనుకున్నారు. ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం కూడా ఇచ్చేశారు. కానీ ఉన్నఫలంగా ఇప్పుడు విడుదల తేదీ మార్చేశారు. చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న తంగలాన్ సినిమాను పొంగల్ రేసు నుంచి తప్పించి, రిపబ్లిక్ డేకు షిఫ్ట్ చేశారు. ఈ సినిమా జనవరి 26న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది.

ఈ పొంగల్ కి తమిళనాట లాల్ సలామ్ సినిమా రిలీజ్ ఉంది. ఇందులో రజనీకాంత్ గెస్ట్ రోల్ కంటే కాస్త పెద్ద పాత్ర పోషించారు. రజనీ కూతురు ఈ సినిమాకు దర్శకురాలు. ఈ సినిమాకు పోటీగా తంగలాన్ రిలీజ్ అవుతుందని భావించారు. అయితే కర్నాటక, ఆంధ్రప్రదేశ్ లో పండగ తేదీలు ఖాళీగా లేవు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో గట్టిపోటీ నెలకొంది.

దీంతో పాన్ ఇండియా రిలీజ్ కోసం తంగలాన్ ను వాయిదా వేశారు. విక్రమ్ ఈ సినిమాలో డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తున్నాడు. 1870ల నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా పా రంజిత్ దర్శకుడు.

ఈ సినిమా సెట్స్ లోనే ఓ ఫైటింగ్ సీక్వెన్స్ తీవ్రంగా గాయపడ్డాడు విక్రమ్. అతడి పక్కటెముకులకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స తీసుకొని, కొన్నాళ్లు రెస్ట్ తీసుకొని, తిరిగి తంగలాన్ సెట్స్ లో జాయిన్ అయ్యాడు విక్రమ్. అందుకే ఈ సినిమా విడుదల ఆలస్యమైంది. మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

అయితే ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించి లో-ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకుంటే, ఈ సినిమా కంటే ముందు విక్రమ్ నటించిన ధృవనక్షత్రం విడుదలకాబోతోంది. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత, తంగలాన్ ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు.



Source link

Related posts

సలార్ చూడాల్సిన కళ్లతో.. ప్రభాస్ ఫ్యాన్స్ ఆవేదన

Oknews

భార్యా, పిల్ల‌ల్ని చంపి…తానూ!

Oknews

తేజ్ బ్రదర్స్.. నెక్ట్స్ ఏంటీ?

Oknews

Leave a Comment