సరికొత్త సంచలనానికి రంగం సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు, ప్రభాస్ అభిమానులు ఆరోజు కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ‘కల్కి 2898ఎడి’ చిత్రం జూన్ 27న విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రభాస్, నాగ్‌అశ్విన్ కాంబినేషన్‌లో అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో జరగడం లేదు. బుజ్జిపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలను బట్టి అర్థమవుతోంది. చెన్నై, ఢల్లీి వంటి నగరాల్లో బుజ్జిని రైడ్ చేస్తూ అక్కడి జనాల్ని ఆకర్షిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఓవర్సీస్‌లో ‘కల్కి’ ఓ కొత్త రికార్డును క్రియేట్ చేసింది. కేవలం ప్రీ సేల్స్‌తోనే నార్త్ అమెరికాలో రెండు మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. సాధారణంగా టాప్ హీరోల సినిమాలు లాంగ్ రన్‌లో 1 మిలియన్ డాలర్లు రాబట్టడం చాలా గొప్ప విషయంగా చెప్పుకునేవారు. కానీ, దాన్ని ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే అధిగమించడం విశేషం.
‘కల్కి’ జోరు రిలీజ్‌కి ముందే ఇలా ఉంటే రిలీజ్ తర్వాత ఇంకెలా ఉంటుందోనని అభిమానులు ఎంతో ఉత్సాహంగా దీని గురించి చర్చించుకుంటున్నారు. మొదటి రోజు కలెక్షన్స్‌లో ‘కల్కి’ ఖచ్చితంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఎంతో కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఆదిపురుష్ చిత్రం మొదటి రోజు రూ.130 కోట్లు కలెక్ట్ చేయగా, ‘సలార్’ రూ.150 కోట్లు వసూలు చేసింది. ఆ లెక్కన చూస్తే ‘కల్కి’ డెఫినెట్‌గా రూ.200 కోట్ల వరకు ఓపెనింగ్స్ వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. భారీ తారాగణంతో హయ్యస్ట్ బడ్జెట్‌తో రూపొందిన ‘కల్కి’ కలెక్షన్ల పరంగా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.