Entertainment

రిస్క్ చేస్తున్న ప్రముఖ సంగీత దర్శకుడు.. పాన్ ఇండియా మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ!


రైటర్స్, సినిమాటోగ్రాఫర్స్, ఎడిటర్స్, కొరియోగ్రాఫర్స్ ఇలా ఎందరో.. డైరెక్టర్స్ గా మారడం చూస్తుంటాం. అలాగే కొందరు సంగీత దర్శకులు కూడా మెగాఫోన్ పట్టి దర్శకులుగా మారుతున్నారు. ఇప్పటికే ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్. పి. పట్నాయక్ దర్శకుడిగా పలు సినిమాలను రూపొందించారు. ఇప్పుడదే బాటలో మరో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ పయనిస్తున్నాడు.

2000లలో తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు ఘంటాడి కృష్ణ. ‘6 టీన్స్’, ‘సంపంగి’, ‘జానకి వెడ్స్ శ్రీరామ్’ వంటి సినిమాలకు ఆయన సంగీతం అందించారు. ఫోక్ టచ్ తో ఘంటాడి కృష్ణ స్వరపరిచిన మెలోడీలు అప్పట్లో యువతని ఒక ఊపు ఊపాయి. అప్పట్లో తన సంగీతంతో ఎంతగానో ఆకట్టుకున్న ఘంటాడి.. కొన్నేళ్లుగా యాక్టివ్ గా లేరు. అలాంటిది ఇప్పుడు ఓ పాన్ ఇండియా సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతుండటం విశేషం.

ఘంటాడి కృష్ణ దర్శకత్వంలో ‘రిస్క్’ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి ఆయన డైరెక్టర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేయడమే కాకుండా.. ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ఇది 2001లో వచ్చిన ‘6 టీన్స్‌’కు సినిమాకి సీక్వెల్ అని తెలుస్తోంది. సందీప్‌ అశ్వ, సన్యా ఠాకూర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీతో ఘంటాడి కృష్ణ మ్యాజిక్ చేస్తారేమో చూడాలి.



Source link

Related posts

ఎద అందాలతో అందరిని పడేసింది ..!

Oknews

kajal aggarwal marriage photos: ముంబైలో ఘనంగా కాజల్ అగర్వాల్ పెళ్లి…అనుకోకుండా షాకింగ్ ఘటన

Oknews

రవితేజ భలే తప్పించుకున్నాడు.. లేదంటే దిమ్మ తిరిగేది!

Oknews

Leave a Comment