Top Stories

రుషికొండ జగన్ ఎక్కకూడదంతే…!


జగన్ ఏపీకి సీఎం. విశాఖలో రుషికొండ మీద కట్టిన కట్టడాలు అన్నీ ప్రభుత్వానికి చెందినవి. ఇంతకు ముందు రుషికొండ మీద ఏ కట్టడమూ లేదా అంటే టూరిజం వారిదే రిసార్ట్స్ ఉండేది. దాన్ని మార్చి ఆధునికంగా కట్టడాలని వైసీపీ ప్రభుత్వం కట్టడం మొదలెట్టింది.

అయితే రుషికొండ మీద కట్టడాలేంటి అని విపక్షాలు పెద్ద గొంతు చేశాయి. పర్యావరణం ఏమి కావాలి అంటూ విమర్శలూ చేశాయి. చివరికి కోర్టులో కేసులు వేశారు. గతంలో కేంద్ర బృందాలను సర్వే చేయమని హైకోర్టు ఆదేశించింది. విపక్షాలు చెప్పినట్లుగా ఇరవై ఎకరాలలో కట్టడాల నిర్మాణం జరగడంలేదని కేంద్ర బృందాలు తేల్చాయి.

దాని కంటే ముందు ప్రభుత్వం కూడా తాము మొత్తం పన్నెండు ఎకరాలలో కట్టడాలను నిర్మిస్తున్నామని చెప్పింది. ఇపుడు అన్నీ పూర్తి అయ్యాయి. అవి అత్యధికంగా తీర్చిదిద్దారు. అందులో కొన్ని లీజుకు ప్రభుత్వం తీసుకుని వాటిలో సీఎం క్యాంప్ ఆఫీసుని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తోందని వార్తలు వచ్చాయి.

జగన్ సైతం డిసెంబ‌ర్ లోగా తాను విశాఖలో మకాం పెడతాను అని ప్రకటించారు. దీంతో గతంలో ఎవరైతే హైకోర్టులో పిటిషన్ వేశారో వారే తిరిగి పిటిషన్ వేశారు. దాంతో హైకోర్టు కేంద్ర బృందాలను దర్యాప్తు చేయాలని ఆదేశించింది. కేంద్ర బృందాలు వచ్చి అక్కడ కట్టడాలను పరిశీలించి నిబంధనల ఉల్లంఘన జరిగిందా లేదా అన్న దాని మీద ఒక నివేదికను కోర్టుకు సమర్పిస్తుంది అని అంటున్నారు.

ఆ తరువాతనే అక్కడ భవనాలను ప్రభుత్వం లీజుకు తీసుకోగలుగుతుంది. ఇదంతా ఎప్పటికి జరుగుతుందో తెలియదు అని అంటున్నారు. జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ రుషికొండ ఎక్కకూడదు అన్న పట్టుదలలో విపక్షాలు ఉన్నాయి. జగన్ ఏమైనా దేవుడా కొండ మీద ఉండడానికి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ మధ్యన విశాఖ పర్యటనలో హాట్ కామెంట్స్ చేశారు. విశాఖలో చాలా కొండల మీద నిర్మాణాలు ఎన్నో జరిగినా కూడా విపక్షాలు ఎందుకు పట్టించుకోవని వైసీపీ వారు ప్రశ్నిస్తున్నారు.

పూర్తిగా నిబంధనలకు లోబడి ప్రభుత్వ కట్టడాలు పూర్తి చేశామని, అందులో ప్రభుత్వం తన అవసరాల కోసం వాడుకుంటే వచ్చిన తప్పు ముప్పూ ఏంటని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే జగన్ రుషికొండ విషయంలో పట్టుదలగా ప్రతిపక్షాలు ఉన్నాయి. ఈ విషయంలో ఎవరు గెలుస్తారు అన్నదే అసలైన పాయింట్.



Source link

Related posts

బాబు హెల్త్ రిపోర్ట్‌పై వివాదం!

Oknews

కౌశిక్‌రెడ్డిపై చ‌ర్య‌ల‌కు త‌మిళిసై!

Oknews

త్రివిక్రమ్-ఎన్టీఆర్.. సాధ్యమేనా?

Oknews

Leave a Comment