బీజేపీ, ఎంబీటీ పార్టీలను ఎదుర్కొనేందుకే కాంగ్రెస్ తో మజ్లిస్ దోస్తీ?మరోవైపు హైదరాబాద్ పార్లమెంటరీ స్థానం నుంచి బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్న మజ్లీస్ బచావో పార్టీ(MBT), కాంగ్రెస్ పార్టీ(Congress) నుంచి తమకు పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తుందని గంపెడు ఆశలతో ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యకుత్ పురా నియోజకవర్గ నుంచి కేవలం 878 ఓట్ల తేడాతో పరాజయం పాలైనా….. మజ్లీస్ పార్టీకి మాత్రం చుక్కలు చూపించిన ఆ పార్టీ అధికార ప్రతినిధి అంజధులా ఖాన్ సైతం హైదరాబాద్ పార్లమెంటు స్థానంపై కన్నేశారు. ఇప్పటి నుంచే స్థానిక ప్రజా సమస్యలను తెలుసుకొని ప్రజలకు దగ్గరవుతున్నారు. అటు ఎంబీటీతో పాటు ఇటు బీజేపీ అభ్యర్థిని ఎన్నికల బరిలో ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవ్వడమే రాజకీయంగా కలిసి వస్తుంది అని భావించిన మజ్లిస్ పార్టీ ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తూ వ్యూహాలు రచిస్తోంది.
Source link