బినామీ పేర్లతో వందల ఎకరాలు
కొమ్మారెడ్డి బ్రహ్మానంద రెడ్డి, కేపీవీ అంజనీకుమార్, గుమ్మడి సురేష్, కొల్లి శివరాం, మంత్రుల కుటుంబ సభ్యులు కొందరు ఇలా కొనుగోలు చేసిన వారిలో ఉన్నారని సీఐడీ ఛార్జ్ షీట్(CID Charge Sheet) లో తెలిపింది. నిషేధిత జాబితాలోని అసైన్డ్ భూములపై రిజిస్ట్రేషన్లు, GPAలను అనుమతించమని మంగళగిరిలోని సబ్-రిజిస్ట్రార్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారని తెలిపింది. దీనిపై మేజిస్ట్రేట్ ముందు సెక్షన్ 164 Cr.PC కింద కేసు నమోదు చేశామని పేర్కొంది. మాజీ మంత్రి నారాయణ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలు, కంపెనీల నుంచి ఎం/ఎస్ రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఇతర రియల్ ఎస్టేట్ మధ్యవర్తులతో రైతులకు చెల్లించిన దాదాపు రూ.16.5 కోట్లకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు లభించాయని తెలిపింది. నారాయణ తన బినామీల పేర్లతో అసైన్డ్ భూములు, అక్రమంగా విక్రయ ఒప్పందాలు చేసుకున్నారని చెప్పింది. దాదాపు 162 ఎకరాల అసైన్డ్ భూములను అక్రమంగా కొనుగోలు చేశారని సీఐడీ అభియోగించింది. చంద్రబాబు, నారాయణలకు రాజకీయంగా అనుబంధం ఉన్న మరికొందరు కూడా రాజధాని ప్రాంతంలో వందల ఎకరాల అసైన్డ్ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని సీఐడీ ఛార్జ్ షీట్ లో తెలిపింది.