ప్రజాపాలన దరఖాస్తులతో అర్హుల ఎంపికప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను గ్రామాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు పరిశీలించనున్నారు. వీరి పరిశీలన అనంతరం అర్హుల వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌లో నమోదు చేయనున్నారు. ప్రతి కార్యకర్త 30 అప్లికేషన్లను పరిశీలించనున్నారు. రేషన్ కార్డు, ఎల్‌పీజీ కనెక్షన్ వివరాలు, పాస్‌బుక్ నెంబర్, డెలివరీ రసీదు నెంబర్ వివరాలను పరిశీలించనున్నారు. గ్రామాల్లో అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు పూర్తి స్థాయి అవగాహన ఉండటంతో అర్హుల ఎంపిక ప్రక్రియను వారికి అప్పగించినట్లు తెలుస్తోంది. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి, మండలస్థాయిలో ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు, జిల్లాల్లో కలెక్టర్లు అర్హుల వివరాలు నమోదు చేసే యాప్ ను పర్యవేక్షించనున్నారు. రాష్ట్రస్థాయిలో రెవెన్యూ కార్యదర్శి, పౌరసరఫరాల శాఖ అధికారులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్ పర్యవేక్షించనున్నారు. వీరి పరిశీలన అనంతరం రూ. 500లకే గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులను ఎంపిక చేసి పథకాన్ని అమలు చేస్తారు.
Source link
previous post