Top Stories

రెండు భాగాలు మాత్రమే కాదు, 2 ట్రయిలర్స్ కూడా?


ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమాపై పుకార్లు కొత్తేంకాదు. సెట్స్ పైకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ మూవీపై ఏదో ఒక రూమర్ నడుస్తూనే ఉంది. ఆశ్చర్యంగా వీటిలో ఎక్కువ శాతం రూమర్లు నిజమయ్యాయి. 

సినిమా టైటిల్ నుంచి రెండు భాగాలుగా రాబోతోందనే మేటర్ వరకు ఊహాగానాలన్నీ నిజమయ్యాయి. చివరికి ఇందులో విలన్ పాత్రధారి ఎవరనే అంశం కూడా ముందే పుకార్ల రూపంలో బయటకొచ్చేసింది.

ఇప్పుడీ సినిమాపై మరో పుకారు ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే.. సలార్ పార్ట్-1 సీజ్ ఫైర్ కు సంబంధించి 2 ట్రయిలర్లు రిలీజ్ చేస్తారట. వీటిలో ఒక ట్రయిలర్ ను ఈ నెల్లోనే రాబోతున్న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తారట. ఇక రెండో ట్రయిలర్ ను నవంబర్ లో రిలీజ్ చేస్తారట.

ఈ 2 ట్రయిలర్లు ఇచ్చిన హైప్ తో, డిసెంబర్ లో సినిమాను గ్రాండ్ గా విడుదల చేయాలని అనుకుంటున్నారట. సలార్ రిలీజ్ డేట్ పై కూడా డిసెంబర్ 22 అంటూ ముందుగా ఫీలర్లు వచ్చాయి. ఆ తర్వాత నిజమయ్యాయి. ఇప్పుడు ట్రయిలర్ విషయంలో కూడా తాజాగా వినిపిస్తున్న ఫీలర్లే నిజమయ్యే అవకాశం ఉందంటున్నారు చాలామంది. ఇదే నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగ.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది సలార్ సినిమా. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా 2 భాగాలుగా రాబోతోంది. ఇందులో మొదటి భాగం డిసెంబర్ 22న థియేటర్లలోకి వస్తుంది. టీజర్ ఇప్పటికే పెద్ద హిట్.



Source link

Related posts

రాననుకున్నారా… వ‌స్తున్నాః లోకేశ్‌

Oknews

ఈ విజయదశమి చాన్సూ వదిలేస్తున్న జగన్…?

Oknews

పాముకు కోర‌ల్లో విషం.. ష‌ర్మిల‌కు నిలువెల్లా!

Oknews

Leave a Comment