Telangana

రెండు వారాల్లో ఎనిమిది సభలు, నల్గొండ జిల్లాలో కేసీఆర్ పర్యటన-nalgonda district cm kcr poll campaign eight election meetings in two weeks ,తెలంగాణ న్యూస్


మునుగోడులో బహిరంగ సభ

పది రోజుల విరామం తర్వాత ఈ నెల 26వ తేదీన సీఎం కేసీఆర్ మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారు. మునుగోడు నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తొలిసారి 2014 లో విజయం సాధించినా 2018లో ఓటమి పాలైంది. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అనివార్యమైన ఉప ఎన్నికల్లో తిరిగి విజయం సాధించింది. ఉప ఎన్నికల్లో ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు ఎన్నో హామీలను ఇచ్చింది. వాటిలో కొన్నింటిని నెరవేర్చగలిగినా.. పెండింగ్ సమస్యలు ఇంకా ఉన్నాయి. ఈ కారణంగానే మొదట్లోనే ఇక్కడ సీఎం కేసీఆర్ సభను ఏర్పాటు చేసి ఓటర్లకు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నెల 29వ తేదీన ఉమ్మడి జిల్లాలో ఏకంగా మూడు సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఇవన్నీ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు. ఆలేరు, తుంగతుర్తి, కోదాడల్లో సీఎం సభలు ఉంటాయి. ఇందులో ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాలను వరసగా రెండు సార్లు గెలుచుకుని హ్యాట్రిక్ విజయం కోసం ఎదురు చూస్తున్నవే కావడం గమనార్హం. నెలాఖరున 31వ తేదీన కూడా జిల్లాలో ఒకే రోజు మూడు నియోజకవర్గాల్లో సీఎం ఎన్నికల ప్రచార బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. హుజూర్ నగర్, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాలలో సభలు ఉంటాయి. ఇందులో హుజూర్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీసీ మాజీ చీఫ్, నల్గొండ ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి టికెట్ దక్కించుకున్నారు. కాంగ్రెస్ ఇక్కడి నుంచి వరసగా 2009, 2014, 2018 ఎన్నికల్లో గెలిచింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2019 లో ఎంపీగా విజయం సాధించడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా.. జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. దీంతో ఈ సీటుకూ ప్రాధాన్యం ఇస్తున్నారు. మిర్యాలగూడ, దేవరకొండల్లో సైతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్.భాస్కర్ రావు, రవీంద్ర కుమార్ లు ఉన్నారు.



Source link

Related posts

An interesting discussion took place between KTR and Rajagopal Reddy in the assembly lobbies | Komatireddy Rajagopal Reddy : హోంమంత్రిని అవుతా

Oknews

ఖమ్మం జిల్లాలో ప్రైవేటు బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు-a private bus overturned in khammam district 15 travelers were seriously injured ,తెలంగాణ న్యూస్

Oknews

TS Govt Schemes : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్

Oknews

Leave a Comment