Top Stories

రెండు సినిమాలు.. ఇద్దరు హీరోయిన్లు మిస్


ఏ సినిమా, ఎప్పుడు ఎవరి చేతుల్లోకి వెళ్తుందనేది అస్సలు చెప్పలేం. అంతా ఫిక్స్ అయిందనుకున్న టైమ్ లో కూడా అవకాశం చేజారిపోవచ్చు. ఇంతకుముందు ఇలాంటివి చాలా జరిగాయి. తాజాగా మరో 2 బయటపడ్డాయి. రోజుల వ్యవథిలో ఇద్దరు హీరోయిన్లు, తమ చేతి వరకు వచ్చిన ఛాన్సులు కోల్పోయారు.

రీసెంట్ గా నాగచైతన్య కొత్త సినిమాలో హీరోయిన్ ను ప్రకటించారు. చందు మొండేటి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవిని తీసుకున్నారు. ఈ విషయాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించారు. అయితే లెక్కప్రకారం, సాయిపల్లవి చేయాల్సిన సినిమా కాదిది.

ఈ సినిమాలో సాయిపల్లవి కంటే ముందు కీర్తిసురేష్ ను అనుకున్నారు. మత్స్యకారుల కథతో, సముద్రం బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కాస్త డీ-గ్లామర్ గా కనిపించే అమ్మాయి కావాలి. ఆల్రెడీ ఇలాంటి పాత్రలు పోషించిన అనుభవం కీర్తిసురేష్ కు ఉంది. పైగా చైతూ-కీర్తిసురేష్ ది ఫ్రెష్ కాంబినేషన్. గతంలో ఇద్దరూ కలిసి మహానటిలో నటించినా చైతూది గెస్ట్ రోల్ కాబట్టి లెక్కలోకి రాదు.

అలా ఆల్ సెట్ అనుకున్న టైమ్ లో కీర్తిసురేష్ పేరు సైడ్ అయిపోయింది. హిట్ పెయిర్ చైతూ-సాయిపల్లవిని రిపీట్ చేస్తే బాగుంటుందని 'పెద్దలు' నిర్ణయించడం, చకచకా అగ్రిమెంట్లు పూర్తవ్వడం జరిగిపోయాయి.

తాజాగా పూజాహెగ్డే కూడా ఓ మంచి ఆఫర్ మిస్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై త్వరలోనే రాబోతున్న రవితేజ-గోపీచంద్ మలినేని సినిమాలో ముందుగా శ్రీలీలను అనుకున్నారు. అలా హిట్ కాంబో రిపీట్ చేద్దామని భావించారు. కానీ ఆ తర్వాత పూజాహెగ్డే పేరు తెరపైకొచ్చింది. ఆమె కాల్షీట్లు ఇవ్వడానికి రెడీగా ఉండడంతో, ఆమెను లాక్ చేయాలనుకున్నారు. అంతలోనే రష్మికను తీసుకున్నారు.

అయితే పూజాహెగ్డేకు ఇది కొత్తేంకాదు. గుంటూరుకారం లాంటి పెద్ద సినిమా ఆఫర్ ఆమె చేజార్చుకుంది. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్టుకు కూడా ఆమె పేరు గట్టిగా వినిపించింది కానీ కార్యరూపం దాల్చలేదు.



Source link

Related posts

కేరాఫ్ బాలయ్య అల్లుడు కాదట…!

Oknews

రాజకీయ వ్యూహంపై విషం చిమ్ముతున్న ఈనాడు

Oknews

ఔరా.. రాజు గారి సీటుకే ఎసరా…!?

Oknews

Leave a Comment