దిశ, ఫీచర్స్: గత రెండేళ్లతో పోల్చితే ప్రస్తుతం సూర్యుడు మరింత వేడెక్కాడని, ఈ మండుతున్న నక్షత్రం సౌర మంటలను వెదజల్లుతోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో దీని కారణంగా భూగోళంపై వాతావరణం మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. తాజాగా సోలార్ ఆర్బిటర్‌లో వచ్చిన మార్పులకు సంబంధించిన రెండు క్లోజప్ ఫొటోలను విడుదల చేశారు. సూర్యుడి ఉపరితంలో మంటలు వెదజల్లుతున్నట్లు ఈ ఫోటోస్పియర్ సౌర కార్యకలాపాలను బట్టి తెలుస్తోంది.
1843 నుంచి ప్రారంభం
సౌర్య వ్యవస్థకు సంబంధించి సూర్యుడిపై యాక్టివిటీస్‌ను తెలుసుకునే ప్రయత్నం 1843 నుంచే జరుగుతోంది. అప్పట్లో శామ్యూల్ స్క్వాబే అనే సైంటిస్టు17 సంవత్సరాలు వేరియేషన్ ఆఫ్ సన్‌లైట్స్‌ను అంచనా వేయగలిగాడు. ఇది సోలార్ సైకిల్‌ను అర్థం చేసుకోవడంలో దోహదపడింది. ఇక నాటి నుంచి సన్‌స్పాట్స్ సైకిల్స్ గురించి, సౌర తుఫానుల ఫ్లో గురించి శాస్త్రవేత్తలు రెగ్యలర్‌గా గమనిస్తూ వస్తున్నారు. మరోమారు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఫిబ్రవరి 10, 2020న తన సోలార్ ఆర్బిటర్‌ని ప్రారంభించింది. సూర్యుడి యొక్క ధ్రువ ప్రాంతాలను అన్వేషించడం, 11 సంవత్సరాల సౌర చక్రాన్ని ఏది నడిపిస్తుందో అర్థం చేసుకోవడం లక్ష్యంగా ఇది పనిచేసింది.
మరో రెండేళ్లలో ఏం జరుగుతుంది?
తాజాగా సూర్యుడి వాతావరణంలో జరుగుతున్న తీవ్రమైన మార్పులను ప్రస్తావిస్తూ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘సూర్యుడు ఎంతలా మారిపోయాడో చూడండి’’ అంటూ రెండు చిత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు 2019లో లిటిల్ యాక్టివిటీస్‌లో ఉన్న సౌర కార్యకలాపాలు నెమ్మదిగా పెరుగూ వస్తున్నాయని పేర్కొన్నారు. 2021 ఫిబ్రవరి నుంచి 2023 అక్టోబర్ వరకు గమనిస్తే సూర్యుడిపై సౌర మంటలు విస్తరించాయని, 2025 ఈ పరిస్థితి మరింత పెరగవచ్చని చెప్తున్నారు. దీనికారణంగా భూ వాతావరణం గతంతో పోల్చితే మరింత వేడెక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు.