EntertainmentLatest News

రెండో సినిమాకే ధనుష్‌కి దక్కిన అరుదైన గౌరవం.. ‘రాయన్‌’ చిత్రాన్ని గుర్తించిన ఆస్కార్‌!


తమిళ్‌ హీరో ధనుష్‌కి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ ఉంది. అతను హీరోగానే కాకుండా సింగర్‌గా, లిరిక్‌ రైటర్‌గా, నిర్మాత, దర్శకుడిగా పలు శాఖల్లో తన ప్రతిభను చూపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తను హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘రాయన్‌’. గత వారం విడుదలైన ఈ సినిమా తమిళ్‌తోపాటు తెలుగులోనూ ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా సినిమాలో ధనుష్‌ నటనకు, స్క్రిప్ట్‌కి, టేకింగ్‌కి, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌కి చాలా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణతోపాటు ఓ అరుదైన గౌరవాన్ని కూడా దక్కించుకుంది. సినిమా విడుదలైన వారం రోజుల్లోనే ‘రాయన్‌’ ఈ గౌరవాన్ని పొందడం విశేషమనే చెప్పాలి. 

‘రాయన్‌’ చిత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ధనుష్‌ కెరీర్‌లో ఇది 50వ సినిమా. దర్శకుడిగా ఇది రెండో సినిమా. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమాకి మంచి టాక్‌ ఉంది. ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమాను ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అకాడమీ గుర్తించింది. ప్రపంచంలోని విభిన్నమైన స్క్రిప్ట్‌లను, స్క్రీన్‌ప్లేలను ‘అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్‌ అండ్‌ సైన్సెస్‌ లైబ్రరీ’లో భద్ర పరుస్తారు. ఇప్పుడు ధనుష్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వం కూడా వహించిన ‘రాయన్‌’ సినిమాకి ఆ గౌరవం దక్కింది.  

‘రాయన్‌’ స్క్రీన్‌ప్లేను తమ లైబ్రరీలో భద్రపరుస్తున్నామని ఆస్కార్‌ సంస్థ తెలియజేసింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ సోషల్‌ మీడియాలో తెలియజేస్తూ తన సంతోషాన్ని పంచుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన కొన్ని అద్భుతమైన స్క్రిప్ట్‌లను, స్క్రీన్‌ప్లేలకు  ఆస్కార్‌ లైబ్రరీలో చోటు కల్పిస్తారు. గతంలో వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన ‘ది వాక్సిన్‌ వార్‌’, ఇటీవల విడుదలైన తమిళ సినిమా ‘పార్కింగ్‌లకు ఈ గౌరవం దక్కింది. 



Source link

Related posts

Sreemukhi latest instagram pic goes viral జడలో మల్లెపూలతో కొత్తగా శ్రీముఖి

Oknews

Bandi Sanjay on CM KCR : సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరిన బండి సంజయ్ | ABP Desam

Oknews

Mr Perfectionist in SSMB 29 బాలీవుడ్ హీరో కోసం రాజమౌళి ప్రయత్నాలు

Oknews

Leave a Comment