‘రెడ్ బుక్’ బెదిరింపులు కంటిన్యూ అవుతున్నాయ్!


నారా లోకేష్ తమ రాజకీయ ప్రత్యర్థుల్ని బెదిరించడానికి రెడ్ బుక్ అనే పదాన్ని ఊతపదంలాగా వాడుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. రెడ్ బుక్ తెరవక ముందే.. జగన్ ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెడుతున్నారని లోకేష్ ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పటికే అటు అధికార్లకు, ఇటు వైసీపీ నాయకులకు అధికార పక్షం నుంచి పెద్దస్థాయిలో వేధింపులు ఎదురవుతున్నాయని భావిస్తున్న నేపథ్యంలో, లోకేష్ ఇదంతా ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది అని సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లున్నారు.

చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తొలి నాటి నుంచి అధికారుల్ని వేధిస్తున్నట్టుగా అందరూ ఒక రకమైన భయంలో బతుకుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే జగన్ కు అనుకూలంగా వ్యవహరించారనే అనుమానాల మీద అనేక మంది సీనియర్ అధికార్లను లూప్ లైన్లో పెట్టారు. అడ్డగోలుగా ట్రాన్స్ ఫర్లు చేశారు. అవమానకరమైన రీతిలో ఇంటికి పంపారు. కేసులు పెట్టించారు.. పెడుతున్నారు. మొత్తంగా అధికార్లను టార్గెట్ చేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లోకి తీసుకెళ్లారు.

అలాగే నాయకుల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. వారి మీద దాడులు జరుగుతున్నాయి. వారి ఆస్తులను టార్గెట్ చేస్తున్నారు. చెబితే పట్టించుకునే దిక్కు లేదు. కేసు పెట్టడానికి వెళితే పోలీసులు కనీసం నమోదు చేసుకోవడం లేదు. ఇలా ఇబ్బంది పడుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో నారా లోకేష్ చాలా కాలం నుంచి బెదిరిస్తున్న రెడ్ బుక్ గురించే జగన్ కూడా ఢిల్లీ ధర్నాలో ప్రస్తావించారు. దీనిపై లోకేష్ తాజా సెటైర్లే వేయడం విశేషం. రెడ్ బుక్ తెరవక ముందే జగన్ ఢిల్లీలో గగ్గోలు పెడుతున్నారని అంటున్నారు. అంటే ఆ మాటల అర్థం ఏమిటన్నమాట? రెడ్ బుక్ తెరవకుండానే.. ఇప్పటిదాకా జరిగిన చర్యలన్నీ తీసుకున్నాం.. రెడ్ బుక్ తెరిచాం అంటే.. ఇక అప్పుడుంటుంది తడాఖా అని హెచ్చరిస్తున్నట్లు అన్నమాట.

మొత్తానికి నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో వైసీపీ వారి గుండెల్లో భయం పుట్టించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారన్నమాట.

The post ‘రెడ్ బుక్’ బెదిరింపులు కంటిన్యూ అవుతున్నాయ్! appeared first on Great Andhra.



Source link

Leave a Comment