హ్యాండ్ సమ్ హీరో నాగ శౌర్య (naga shaurya)సినీ ఎంట్రీ ఇచ్చి పుష్కర కాలం అవుతుంది. కానీ ఇంకా మినిమమ్ హీరోగానే ఉన్నాడు. కొన్నాళ్ల నుంచి అయితే వరుస ప్లాప్ లతో సతమవుతున్నాడు. హీరోకి ఉండాల్సిన పర్ఫెక్ట్ కట్ అవుట్, మంచి నటుడు అనే అర్హతలు అన్ని ఉండి కూడా విజయలకి దూరంగా ఉంటున్నాడు. ఈ విషయంలో అభిమానులు కూడా చాలా ఫీల్ అవుతు ఉన్నారు. ఇటీవలే కొంత భాగం షూటింగ్ జరుపుకున్న తన నూతన చిత్రాన్ని కూడా తాత్కాలికంగా పక్కన పెట్టాడు. ఇలాంటి టైం లో తన కెరీర్ గురించి ఆలోచించకుండా లేని పోనీ వివాదంలో తలదూర్చాడు.
ఇటీవల కన్నడ అగ్ర హీరో దర్శన్ (darshan)వ్యవహారం సౌత్ సినీ పరిశ్రమలో సెగలు పుట్టించింది. ప్రముఖ నటి పవిత్ర గౌడ్ (pavitra gowd)కి అసభ్య కరమైన మెసేజ్ లు చేసాడని రేణుక స్వామి అనే అతన్ని దర్శన్ అత్యంత దారుణంగా చంపించాడు. దీంతో హత్య కేసులో రెండో నిందితుడిగా ఉన్నాడు.అలాంటిది ఇప్పుడు దర్శన్ ని సపోర్ట్ చేస్తు నాగ శౌర్య తన ఇన్స్ టా లో సుదీర్ఘమైన మెసేజ్ చేసాడు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ కష్ట సమయంలో వారికి ఆ దేవుడు బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అయితే చాలామంది కేసు కోర్టులో ఉండగానే సోషల్ మీడియాలో తీర్పులు ఇచ్చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకూ దర్శన్ అన్న కలలో కూడా ఇతరులకి హానీ చేసే వ్యక్తి కాదు. అతని గురించి బాగా తెలిసిన వాళ్లకి ఖచ్చితంగా అతని క్యారెక్టర్, మనసు గురించి అర్థమవుతుంది. ఎవరికైనా సాయం చేయాలనే చూస్తాడు. ఎంతోమంది జీవితాలను కూడా నిలబెట్టాడు.
నాకు న్యాయవ్యవస్థ పైన నమ్మకం ఉంది. ఖచ్చితంగా త్వరలోనే నిజాలు బయటికి వస్తాయని చెప్పాడు.ఈ కేసు విషయంలో ఎలా పడితే అలా మాట్లాడేటప్పుడు దర్శన్ ఫ్యామిలీ కూడా బాధపడుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వారి ప్రైవసీ, గౌరవానికి దయచేసి ఇలాంటి సమయంలో భంగం కలిగించవద్దు. త్వరలోనే దర్శన్ నిర్దోషిగా బయటికి వస్తాడని బలంగా నమ్ముతున్నాను. ఈ కేసులో అసలైన దోషికి శిక్ష పడాలని కోరుకుంటున్నాను అంటూ తెలిపాడు. దర్శన్ తనకి ప్రేమగా ఒక వాచీని తొడుగుతున్న పిక్ ని కూడా షేర్ చేసి కామెంట్ బాక్స్‌ని మాత్రం ఆఫ్ చేసాడు.దర్శనే హత్య చేయించాడు అనటానికి ఆధారాలు చాలా బలంగా ఉన్నాయి. అలాంటిది నాగ శౌర్య సపోర్ట్ గా మాట్లాడటం చర్చినీయాంశమవుతుంది.