ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభంఎన్నికల హామీలైన ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Housing Scheme) పథకాన్ని ఈ నెల 11న భద్రాచలంలో ప్రారంభనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. ఈ పథకం విధివిధానాలు, నిబంధనలను తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఇప్పటికే ఆదేశించారు. స్థలం ఉన్న వారి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, ఇల్లు లేని పేదలకు స్థలంతో పాటు రూ.5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇళ్లను మంజూరు చేయాలని సూచన ప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. దశల వారీగా గూడు లేని నిరుపేదల సొంత ఇంటి కల నెరవేర్చడం తమ ప్రభుత్వ సంకల్పమని సీఎం తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి స్థలం ఉన్న వారికి అదే స్థలంలో కొత్త ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు అందిస్తారు. ఏయే దశల్లో ఈ నిధులను విడుదల చేయాలనే నిబంధనలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. లబ్ధిదారులకు అందాల్సిన నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని చెప్పారు.
Source link
previous post