హైదరాబాద్ మరో అంతర్జాతీయ ఈవెంట్ కు ఆతిథ్యం ఇవ్వబోతుంది. సెప్టెంబర్ 8న డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్‌ను గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. WWE సూపర్‌స్టార్ స్పెక్టాకిల్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ ఈవెంట్‌లో ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ సేథ్ ఫ్రీకిన్ రోలిన్స్, ఉమెన్ ప్రపంచ ఛాంపియన్ రియా రిప్లే, WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్ సమీ జైన్, కెవిన్ ఓవెన్స్‌లతో పాటు కీలక డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్స్ పోటీ పడుతున్నారు. వీరితో పాటు సూపర్‌స్టార్స్ జిందర్ మహల్, వీర్, సంగ కూడా బరిలోకి దిగుతున్నారు.