రైతు రుణమాఫీపైరాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రెండెకరాల లోపు భూమి ఉన్న 29 లక్షల మంది రైతులకు రైతు బంధు జమ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మిగిలిన రైతులకు రేపటి నుంచి రైతు బంధు నగదు జమ చేస్తేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతు డిక్లరేషన్ ను అమలు చేస్తామన్నారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతాంగం ప్రయోజనాల విషయంలో రాజీపడబోమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎంతో పట్టుదలతో ఉన్నారన్నారు. యాసంగి(రబీ) సీజన్ లో రైతుబంధు జమ చేయడానికి రూ.7,625 కోట్లు అవసరం అవుతాయన్నారు. అయితే ఇప్పటి వరకు 29 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రూ.1,050 కోట్లు జమ చేసిందన్నారు. మిగతా రైతులకు నగదు జమ చేసేందుకు రూ.13,500 కోట్ల రుణం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరామన్నారు. కేంద్రం రూ.9 వేల కోట్ల రుణానికి అనుమతి ఇచ్చిందన్నారు. ఈ రుణంలో రూ.2 వేల కోట్లు ఈనెలలో వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నిధులతో రైతు బంధు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
Source link
previous post