Rahul Gandhi Coolie:కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ గురువారం కొత్త అవతారంలో కనిపించారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ కి వెళ్ళిన రాహుల్ గాంధీ అక్కడి రైల్వే పోర్టర్లతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైల్వే కూలీలు ధరించే షర్ట్ ను, బాడ్జిని రాహుల్ గాంధీ కూడా ధరించారు.