Ramiz Raja: పాకిస్థాన్ టీమ్ మాజీ కెప్టెన్, పీసీబీ మాజీ ఛీఫ్ రమీజ్ రాజా లైవ్ టీవీ డిబేట్ లో పరువు తీసుకున్నాడు. స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో రోజువారీ డైట్ ను ఓ నాసా సైంటిస్ట్ సిద్ధం చేస్తాడంటూ అతడు చెప్పడం గమనార్హం. వరల్డ్ కప్ లో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ప్రదర్శనపై ఓ టీవీ ఛానెల్ చర్చలో పాల్గొన్న రమీజ్.. ఈ షాకింగ్ కామెంట్స్ చేశాడు.