Health Care

రోజంతా బిజీగా ఉంటున్నారా? అయితే పడుకునే ముందు పిల్లలకు ఇవి చెప్పండి..!


దిశ,వెబ్ డెస్క్: ఈ బిజీ ప్రపంచంలో అందరి జీవితాలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా మారాయి.ఒకప్పుడు ఉన్నంత సఖ్యత ఇప్పుడు ఉన్న వారిలో కనిపించడం లేదు. ఎవరి పనుల్లో వారు సమయం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. అంతే కాకుండా కుటుంబంతో సంతోషంగా గడపలేకపోతున్నారు. ఇది కొన్ని సార్లు కుటుంబ కలహాల కు దారితీస్తుంది. ఇది ఇలా ఉంటే..పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పిల్లల బాగోగులు చూసుకోవడంలో ప్రధాన పాత్ర తల్లిదండ్రులదే. వారి అలవాట్లు, అభిరుచులు పేరెంట్స్ కు ఎక్కువగా తెలుస్తాయి. కానీ ప్రస్తుతం వర్క్ బిజీ లో తమ పిల్లలపై దృష్టి పెట్టడం లేదు. ఇది పిల్లల మానసిక స్థితి పై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎలాగంటే.. పిల్లలు చెడు స్నేహాలు చేయడం, మొబైల్ కి ఎక్కువగా అలవాటు పడడం, ఎంజాయ్ మెంట్ అంటూ, టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అందువల్ల పేరెంట్స్ తమ పిల్లల తో కొంత సమయం గడపడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు.

పిల్లలు ఏం కోరుకుంటున్నారో పేరెంట్స్ తెలుసుకోవాలి. వారి ఇష్టాలను గౌరవించాలి. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలతో అక్కడ జరిగిన సన్నివేశాల గురించి అడగాలి. నెలకు ఒకసారైనా పిల్లలు చదువుకునే పాఠశాల కు వెళ్లి చిల్డ్రన్స్ స్టడీ లేవల్స్ తెలుసుకోవాలి. ఏ సబ్జెక్ట్ లో వాళ్లు పర్ఫెక్ట్ గా ఉన్నారో తెలుసుకోవాలి. అసలు విషయం ఏంటంటే..మార్నింగ్ అనగా డ్యూటీ కి వెళ్లిన వారు సాయంత్రం వచ్చి వారి పని వారు చేసుకుంటూ ఉంటారు. పిల్లలు హోం వర్క్ చేసుకుని కాస్త సమయం ఫ్రెండ్స్ తో గడుపుతారు. ఇక పేరెంట్స్ తో మాట్లడేది ఎప్పుడు?

రాత్రి పడుకునే ముందు పిల్లలతో సంతోషంగా స్పెండ్ చేయండి. మొదటగా ప్రేమగా మాట్లాడండి. ఆ రోజులో వారు ఏమైనా తప్పులు చేస్తే కోపంతో వాదించకండి అసలు ఆ విషయాలు ఏవీ తీసుకురాకండి. ఎందుకంటే అది వారి నిద్ర డిస్టర్బ్ చేస్తుంది. ఎప్పుడైనా మీరు పిల్లలతో కలిసి టైం స్పెండ్ చేసినట్లైతే ఆ రోజు ఎలా గడిపారో తెలపండి. అలా మళ్లీ వెళ్దాం అంటూ చెప్పండి. అది వారిలో మనోవికాసానికి దోహదపడుతుంది. నైట్ టైం లో వారి బ్రెయిన్ షార్ప్ గా ఉంటుంది. ఆ సమయంలో వారికి నీతి కథలు చెప్పాలి. వారిలో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించాలి. కొంత మంది పిల్లలు క్వాలిటీస్ వేరేలా ఉంటాయి. చిరాకుగా మూడీగా ఉంటారు వారిని వీక్లీ వన్ టైం అయిన సరదాగా బయటకు తీసుకెళ్లాలి. ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వాలి. అప్పుడే పిల్లలు చైతన్యంతో ఏ పనిలో అయిన ముందుంటారు.



Source link

Related posts

ప్రపంచాన్ని వణికిస్తున్న వేల సంవత్సరాల నాటి వైరస్‌లు

Oknews

కొత్త కోడలు వచ్చిన వేళా విశేషం.. పది రోజుల్లోనే అంబానీ ఆస్తి అంతకంతకూ పెరిగిపోయింది…

Oknews

మీ పేరు ఈ అక్షరాలతో మొదలవుతుందా.. అయితే, మీ లవ్ బ్రేకప్ అవుతుంది!

Oknews

Leave a Comment