దిశ, ఫీచర్స్ : అందంగా ఉండాలని ఎవరు కోరుకోరు. ప్రతీ ఒక్కరూ అందంగా, గ్లామర్‌గా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే చాలా అట్రాక్టివ్‌గా రెడీ కావాలని కోరుకుంటారు. దీనికోసం వారు చాలా డబ్బులు ఖర్చు పెడుతుంటారు. అయితే అలా కాకుండా మన ఇంట్లోనే వంటింటి చిట్కాల ద్వారా మన అందాన్ని మనమే రెట్టింపు చేసుకోవచ్చునంట.అది ఎలా అంటే?
సహజంగా స్కిన్ టోన్ పెంచుకోవడానికి పాలు బెస్ట్ అంట. ఆయిల్ స్కిన్ లేదా కఠినమైన చర్మంతో బాధపడుతున్న వారు. ప్రతీ రోజు రాత్రి సమయంలో పచ్చిపాలను ముఖానికి రాసుకోవాలంట. దీంతో చర్మం సాఫ్ట్‌గా తయారవుతుంది. అలాగే చర్మంపై ఉన్న మురికి, టాన్ తొలగించడానికి.. పాలలో దూదిని ముంచి ముఖం, మెడ, చేతులపై అప్లై చేయాలి. ఈ విధంగా 8 నిమిషాల పాటు రుద్దడం వల్ల చర్మం పై టాన్, మురికి తొలగిపోతుంది.అదే విధంగా పచ్చి పాలలో తేనే శనగపిండి వేసి మిశ్రమాన్ని తయారు చేయాలంట. ఆ మిశ్రమాన్ని ఫేస్‌కు అప్లై చేసి, 15 నిమిషాల పాటు ఉంచి, తర్వాత ముఖాన్ని గోరు వెచ్చని నీటితో కడగాలి. ఇలా చేయడం వలన ముఖంపై ఉన్న మచ్చలు, ట్యాన్ తొలగిపోయి, ఫేస్ నిగారింపుగా తయారవుతుందంట.