Telangana

రోడ్డు విస్తరణ కోసం సొంత ఇంటినే కూల్చివేయించిన కామారెడ్డి ఎమ్మెల్యే-kamareddy news in telugu bjp mla kv ramana reddy ordered municipal workers demolish his house in road extension ,తెలంగాణ న్యూస్



వారం రోజుల్లో స్వచ్ఛందంగా తొలగించండికామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి రైల్వే గేటు వరకు పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది. ప్రస్తుతం 30 ఫీట్లు రోడ్డు మాత్రమే ఉంది. రోడ్డు వెడల్పు చేయడానికి వీలు లేకుండా అనేక మంది తమ నివాస గృహాలు నిర్మించుకున్నారు. ఇళ్ల ముందు కుళాయి గుంతలు, షెడ్డులు ఏర్పాటు చేసుకున్నారు. రోడ్డు వెడల్పు కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు వెడల్పు కోసం ఇండ్లను తొలగించడం తన ఇంటినుంచే మొదలు పెట్టాలని అడ్డుగా ఉన్న తన ఇంటిని కూల్చేసి ఆ స్థలాన్ని అధికారులకు అప్పగించారు. శనివారం ఉదయం ఆర్ అండ్ బి, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు ఆధ్వర్యంలో జేసీబీలతో దగ్గరుండి ఇంటిని కూల్చేయించారు. అదే రోడ్డులో పంచముఖి హనుమాన్ ఆలయం కూడా ఉండటంతో అలయానికి ఇబ్బంది కలగకుండా రోడ్డు పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. అభివృద్ధికి ప్రజలు సహకరించాలని, వారం రోజుల్లో రోడ్డుపై ఉన్న కుళాయి గుంతలు, షెడ్డులు ప్రజలే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని కోరారు. నెల రోజుల్లో ఇప్పుడున్న రోడ్డుకు అదనంగా మరొక 24 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయాలని అధికారులను ఆదేశించారు.



Source link

Related posts

G Kishan Reddy Offeres Prayer At Sammakka Sarakka Temple In Medaram

Oknews

Legislature Council Chairman Gutta Sukhender Reddy Is In The News That He Is Changing The Party Denied

Oknews

మూసీ నది పునరుజ్జీవానికి ‘థేమ్స్‌’ ప్రణాళిక-cm revanth discussed state govt plans for river musi rejuvenation with officials of the governing body of river london ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment