సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి తగినంత సమయం కేటాయించడంలో మెగా ఫ్యామిలీ హీరోలు ముందుంటారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) లండన్ లో కుటుంబంతో కలిసి దిగిన ఒక బ్యూటిఫుల్ ఫొటోను షేర్ చేసుకున్నారు. పైగా ఆ ఫొటో ద్వారా తన మనవరాలు క్లీంకార (Klin Kaara)ను పరిచయం చేయడం విశేషం.
“లండన్‌లోని హైడ్ పార్క్‌లో కుటుంబం మరియు గ్రాండ్ లిటిల్ వన్ క్లీంకారతో ప్రశాంతమైన క్షణాన్ని ఆస్వాదిస్తూ” అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఫొటో షేర్ చేశారు. ఆ ఫొటోలో చిరంజీవితో ఆయన సతీమణి సురేఖ, కుమారుడు రామ్ చరణ్ (Ram Charan), కోడలు ఉపాసన, మనవరాలు క్లీంకార ఉన్నారు.
రామ్ చరణ్-ఉపాసన దంపతులు గతేడాది జూన్ లో క్లీంకారకు జన్మనిచ్చారు. పాపకి సంబంధించిన పలు ఫోటోలను ఇప్పటికే విడుదల చేశారు కానీ.. ఇప్పటిదాకా బయట ప్రపంచానికి ఫేస్ ని రివీల్ చేయలేదు. అయితే తాజాగా చిరంజీవి షేర్ చేసిన పిక్ లో క్లీంకార ఫేస్ కూడా కనిపిస్తోంది. దీంతో మెగా అభిమానులు.. మెగా వారసురాలు అంటూ మురిసిపోతున్నారు.
కాగా, మెగా కుటుంబం లండన్ నుంచి పారిస్ 2024 ఒలింపిక్స్ ప్రారంభ వేడుకకు వెళ్తోంది.