వివాదాలకు కేంద్ర బిందువుగా రామ్ గోపాల్ వర్మ తన కెరీర్‌లోన్ ఎప్పుడూ లేని విధంగా ఓ ట్వీట్ చేసి సంచలనం సృష్టించారు. ప్రస్తుతం లక్ష్మీ పార్వతి దృష్టికోణం నుండి ఎన్టీఆర్ జీవిత నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన రెండు ట్రైలర్స్ భారీ సక్సెస్ అందుకున్నాయి. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 22న చిత్రాన్ని థియేటర్స్‌లోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తుండగా, కొందరు చిత్రాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
దీనిపై స్పందించిన ఆర్జీవీ సినిమా రిలీజ్‌ని ఆపాలంటే ముందుగా నన్ను చంపండి. ఒకవేళ నన్ను చంపినా కూడా సినిమా రిలీజ్ ఆగదు. ‘ఓ హార్డ్ డిస్క్‌లో రష్ అంతా వుంచి, నాకేమైనా అయితే ఇందులో వున్న కంటెంట్ అంతా యూట్యూబ్‌లో అప్ లోడ్ చేయాలని చీటీరాసి పెట్టాను. అందువల్ల దీన్ని బయటకు రాకుండా అయితే ఎవ్వరూ ఆపలేరు’ అని వర్మ ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అంతే కాకుండా ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తన అభిమానులకు, నెటిజన్లకు షేర్ చేశాడు. ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచిన వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఏయే అంశాలు చూపిస్తాడా అనే దానిపై హాట్ టాపిక్ నడుస్తుంది. తాజాగా చిత్రం నుండి సింహగర్జన అనే వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ అభిమానులని ఆకట్టుకుంటుంది.