నిరాధార ఆరోపణలుసింగపూర్(Singapore) నుంచి చెన్నై(Chennai)కి ముబీన్ అనే వ్యక్తి లగ్జరీ వాచీ(Luxury Watches)లను స్మగ్లింగ్(Smuggling) చేశాడని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ముబీన్ తెచ్చిన వాచీలను మధ్యవర్తి నవీన్ కుమార్ ద్వారా హర్షరెడ్డి(Ponguleti Harsha Reddy) కొనుగోలు చేసినట్లు గుర్తించామని కస్టమ్స్ అధికారులు చెప్పారు. అయితే ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని పొంగులేటి హర్షరెడ్డి తెలిపారు. వాచీ ల తరలింపులో తన ప్రమేయంలేదని, తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ కేసులో ముహమ్మద్ ఫహెర్దీన్ ముబీన్ నుంచి స్వాధీనం చేసుకున్న రెండు లగ్జరీ వాచీలు-పాటెక్ ఫిలిప్ 5740, బ్రెగ్యుట్ 2759 ఉన్నాయి. రూ.100 కోట్లకు పైగా స్మగ్లింగ్ జరగవచ్చని కోర్టు భావించడంతో స్మగ్లర్ నవీన్ కుమార్ ముందస్తు బెయిల్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. హర్ష రెడ్డి ప్రమేయంపై తదుపరి విచారణ జరిపి నవీన్ కుమార్‌ను అరెస్టు చేయాలని ఆలందూరు కోర్టు పోలీసులను ఆదేశించింది.
Source link