తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ఎంతో ప్రతిభగల గీత రచయితలలో అనంత శ్రీరామ్ ఒకరు. ఆయన కలం నుంచి ఇప్పటికే ఎన్నో అద్భుతమైన పాటలు జాలువారాయి. అర్థవంతమైన పాటలు రాయడంలోనే కాదు.. అల్లరి చేయడంలోనూ అనంత శ్రీరామ్ ముందుంటారు. టీవీలో వచ్చే పాటల కార్యక్రమాలలో తనదైన మాటలు, స్టెప్పులతో వినోదాన్ని పంచుతారు. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తుంటారు. ఇక తాజాగా ఆయన పోస్ట్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా లడఖ్ వెళ్లిన అనంత శ్రీరామ్.. “లడఖ్ లో ఈ మాత్రం సరిపోదా” అంటూ అక్కడ జంప్ చేసిన ఒక వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. లోయ పక్కన చేసిన ఈ జంప్.. చూడటానికి రిస్కీగానే కనిపిస్తోంది. అనంత శ్రీరామ్ గట్స్ ని, ఎనర్జీని మెచ్చుకోవాల్సిందే.