Entertainment

లవ్‌ విషయంలో అడ్డంగా బుక్‌ అయిన కిరణ్‌ అబ్బవరం!


సినిమా తారలు ప్రేమలో పడడం, చెట్టా పట్టాలేసుకొని షికార్లు చేయడం, ఆ విషయం గురించి ప్రస్తావిస్తే ఖండిరచడం, తర్వాత వాళ్ళిద్దరే పెళ్ళి చేసుకోవడం… ఇవన్నీ ఎన్నో సంవత్సరాలుగా మనం చూస్తున్నవే. ఒక సినిమా జంట ప్రేమలో ఉన్నప్పటికీ దాన్ని ఒప్పుకోవడం అనేది జరగదు. ఆ తర్వాత తాము పెళ్ళి చేసుకోబోతున్నామంటూ ప్రకటిస్తారు. ఇదీ సహజమే. తాజాగా ఓ జంట అలాంటి పరిస్థితిలోనే ఉంది. రాజా వారు రాణిగారు సినిమాతో హీరోగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కిరణ్‌ అబ్బవరం ఇప్పుడు లవ్‌లో ఉన్నాడు. ఇదే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన రహస్య గోరఖ్‌తో కిరణ్‌ లవ్‌ ఎఫైర్‌ నడుస్తోందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అలాగే వీరిద్దరూ వెకేషన్‌కి వెళ్ళడం, అక్కడ దిగిన ఫోటోలు షేర్‌ చెయ్యడంతో వీరి లవ్‌ గురించి రకరకాల కామెంట్స్‌ వచ్చాయి. అంతేకాదు, కిరణ్‌ ఇంటిలో గృహ ప్రవేశ కార్యక్రమం జరిగినపుడు ఇంట్లో మనిషిలా పువ్వులు గుచ్చుతూ కనిపించింది రహస్య. దీంతో వీరి లవ్‌ కన్‌ఫర్మ్‌ అయ్యింది. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వీరి ప్రేమ వ్యవహారం గురించి ప్రస్తావిస్తూ మీ పెళ్ళెప్పుడో డేట్‌ చెబుతారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ‘మా మధ్య అలాంటిదేమీ లేదు. ఏదైనా ఉంటే మేమే చెబుతాం’  అని సమాధానమిచ్చాడు. మీ మధ్య ఏదో ఉందని మీరిచ్చిన సమాధానమే ప్రూవ్‌ చేస్తోంది అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అంటూ ‘మేమే చెబుతాం’ అని అన్నారంటే ఏదో ఉందనే కదా అనడంతో.. నేను ఏ ఇంటర్వ్యూలోనూ ఇలా దొరికిపోలేదు అంటూ నవ్వేశాడు కిరణ్‌. దీంతో వీరి ప్రేమ వ్యవహారం కాస్తా బట్టబయలు అయింది. అయితే వీరి ప్రేమ వ్యవహారం, పెళ్ళి వంటి విషయాలను అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. 



Source link

Related posts

డైరెక్టర్ నా అన్నయ్యే..రవితేజ చెప్పినా కూడా మారదు

Oknews

కల్కి రికార్డు కలెక్షన్స్.. తొలి రోజు అక్కడ  2 .2 కోట్ల రూపాయిలు

Oknews

కుక్కల ఆపరేషన్ కి 100 ఇవ్వండంటున్న నటి   

Oknews

Leave a Comment