Entertainment

లావ‌ణ్య బ్యాచిల‌ర్ పార్టీ.. ఫొటోలు వైర‌ల్


టాలీవుడ్ హీరో వ‌రుణ్ తేజ్ త్వ‌ర‌లోనే ఓ ఇంటివాడు కాబోతున్న సంగ‌తి తెలిసిందే. హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠిని ఆయ‌న వివాహం చేసుకోబోతున్న సంగ‌తి తెలిసిందే. అది కూడా డెస్టినేష‌న్ వెడ్డింగ్. ఇట‌లీలోని టుస్కానీ విలేజ్‌లో న‌వంబ‌ర్ 1న‌ ఈ ల‌వ్ బ‌ర్డ్స్ ఒక్క‌టి కానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాటు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే వ‌రుణ్ తేజ్ అన్న‌య్య‌, హీరో రామ్ చ‌ర‌ణ్ త‌న స‌తీమ‌ణి ఉపాస‌న‌తో క‌లిసి ఇటలీలో చేరుకున్నారు. కాబోయే వ‌రుడు వ‌రుణ్ తేజ్ కూడా ఇట‌లీ చేరుకున్నారు. డెస్టినేష‌న్ వెడ్డింగ్ కాబ‌ట్టి ప‌రిమిత సంఖ్య‌లో కుటుంబ స‌భ్యులు, మిత్రులు, స‌న్నిహితులు మాత్ర‌మే ఈ వివాహానికి హాజ‌రు కాబోతున్నారు.

వివాహం త‌ర్వాత హైద‌రాబాద్‌లో సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌కు మెగా ఫ్యామిలీ గ్రాండ్ రిసెప్ష‌న్‌ను కూడా ప్లాన్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌హా చాలా ప‌రిమితంగానే ఈ పెళ్లికి హాజ‌రు కాబోతున్న‌ట్లు స‌మాచారం. తాజాగా  కాబోయే మెగా కోడలు ఇచ్చిన బ్యాచిల‌ర్ పార్టీకి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఈ పార్టీలో నితిన్ స‌తీమ‌ణి షాలిని, రీతూవ‌ర్మ‌, నిహారిక‌, నీర‌జ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఉపాస‌న టస్కానీకి సంబంధించిన వీడియోలు, ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాలో షేర్ చేశారు. 



Source link

Related posts

అప్పుడు అల్లరి నరేష్.. ఇప్పుడు సంగీత్ శోభన్

Oknews

ప్రభాస్ కోసం సీఎం, డిప్యూటీ సీఎం!

Oknews

పృథ్వీ కష్టానికి ప్రతి ఫలం ఇదే.. షాక్ ఇస్తున్న కలెక్షన్స్ లు 

Oknews

Leave a Comment