Health Care

లావెండర్ మ్యారేజ్.. అందుకు పనికిరామని తెలిసినా పెళ్లి చేసుకోవడమే..


దిశ, ఫీచర్స్: వివాహం అనేది భిన్న లింగాలకు చెందిన వ్యక్తుల మధ్య జరగాలనే ఆచారం కొనసాగుతుంది. అంటే ‘ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలి.. పిల్లలను కనాలి.. ఇది సృష్టి ధర్మం..’ అని పెద్దలు నిర్ణయించారు. పురాణాలు కూడా ఇదే చెప్తున్నాయి. కానీ ఒక అమ్మాయి అమ్మాయికి మాత్రమే ఎట్రాక్ట్ అయినప్పుడు.. ఒక అబ్బాయి ఇంకో అబ్బాయికే ఆకర్షితుడై ఉన్నప్పుడు.. ఈ పెళ్లి అనేది ట్రాష్ అయిపోతుంది. భార్య లేదా భర్తకు సదరు వ్యక్తి న్యాయం చేయలేక నలిగిపోతున్నాడు. మానసికంగా కుమిలి పోతున్నాడు. అంటే ఒక వ్యక్తి భిన్న లింగం కలిగిన మరో వ్యక్తితో పెళ్లి జరిగినా.. ఎలాంటి ఫీలింగ్స్ లేకపోవడం.. దీని కారణంగా ఇద్దరు ఇబ్బంది పడటం జరుగుతుంది. ఫైనల్ గా లెస్బియన్ అయిన స్త్రీ లేదా పురుషుడు.. భిన్న లింగం కలిగిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని ‘ లావెండర్ మ్యారేజ్ ‘ అంటారు. కాగా ఇది సామాజిక, సాంస్కృతిక ఒత్తిళ్లను ఎదుర్కోవటానికి పోరాడుతున్న వ్యక్తికి చివరి మార్గంగా ఉంది.

ఒకే లింగానికి చెందిన ఇద్దరిని పెళ్లి చేసుకోకుండా అడ్డుపడినప్పుడు లావెండర్ మ్యారేజ్ జరుగుతుంది. అంటే ఆ తర్వాత ఒక స్వలింగ సంపర్కుడు స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు అన్ని విధాలుగా అన్యాయం చేస్తాడు. ఈ విధంగా ఆ స్త్రీ మోసపోతుంది. దీంతో ఇద్దరి జీవితాలు నాశనం అవుతాయి. నిజానికి లావెండర్ మ్యారేజ్ లు వైపరీత్యాలకు వంటకాలుగా మారాయి. స్వలింగ సంపర్కుడైన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు.. ఎదురు కట్నం ఇవ్వడం లేదంటే ఆ రహస్యాన్ని దాచి ఉంచడం జరుగుతుంది. ఆ తర్వాత వీరిద్దరికి ఓ పిల్లో పిల్లాడో పుట్టడం.. దీనివల్ల భర్త ఎప్పటికైనా మారడా అని జీవితాంతం వెయిట్ చేయడంతోనే ఆ భార్యకు సరిపోతుంది. విషపూరితమైన మగతనం కలిగిన భర్తతో పాటు అత్తామామలతో గొడవలు స్టార్ట్ అయిపోతాయి. ఆ కుటుంబం మొత్తం ఈ తప్పుకు పర్యవసానంగా సంతోషంలేని జీవితాలను గడపాల్సి వస్తుంది.

ఒకసారి చరిత్రను పరిశీలిస్తే లావెండర్ వివాహాలు.. విడిపోవడం, విడాకులు తీసుకోవడంతోపాటు పెళ్లి చేసుకున్న భార్య/ భర్త లేదా ఇద్దరి మానసిక ఆరోగ్యం క్షీణించడానికి కారణం అవుతున్నాయి. ఇష్టం లేకపోయినా ఈ బంధానికి కట్టుబడి ఉంటున్న స్వలింగ సంపర్కుల జీవితం ముసుగు ధరించి పరుగు పెట్టినట్లుగా ఉంటుంది. ఒకేసారి రెండు పాత్రలు పోషిస్తున్న అనుభూతి కలుగుతుంది. నిరంతరం ఏదో ఆలోచనతో బ్రెయిన్ పరుగుపెడుతుంది. దీంతో నిరాశ, ఆందోళన వెంటాడతాయి. కొద్దిరోజులకు అభిజ్ఞా శక్తిపై ఎఫెక్ట్ పడుతుంది. మెమరీ లాస్ తో పిచ్చి వాళ్ళుగా మారిపోయి చివరికి జీవితం ముగిసిపోతుంది.

LGBTQ+ జనాభాకు మానసిక ఆరోగ్య సంక్షోభానికి విడదీయలేని అనుబంధం ఉంది. సాధారణ జనాభాలో 56 మిలియన్ల మంది డిప్రెషన్‌తో, 38 మిలియన్ల మంది ఆందోళన రుగ్మతలతో పోరాడుతున్న దేశంలో మనం జీవిస్తున్నాం. ఇక క్వీర్ వ్యక్తుల విషయానికి వస్తే ఈ పరిస్థితి మరింత అధ్వాన్నంగా, భయంకరంగా ఉంది. వీరు సమాజం నుంచి ఎదుర్కొనే కళంకం నుంచి వచ్చే అధిక ఒత్తిడితో వారి మెంటల్ హెల్త్ ముడిపడి ఉంది. కనీసం తల దాచుకునేందుకు ఇల్లు అద్దెకు దొరకని పరిస్థితుల్లో ఉండటం శోచనీయం. అయితే లావెండర్ వివాహాలకు అసలు కారణం.. చిన్నప్పటి నుంచే వ్యక్తుల్లో జరిగే మార్పులను అంగీకరించకపోవడం. కుటుంబం, గౌరవం అంటూ సదరు వ్యక్తి ఆలోచనలను, ఫీలింగ్స్ ను అణిచివేయడం. ఎగతాళి చేయడం, దాడులకు పాల్పడటం, ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడం ఈ పరిస్థితులకు దారితీస్తున్నాయి. అంతేకాదు పెళ్లిని ఇద్దరు వ్యక్తుల మధ్య బంధంగా కాకుండా రెండు కుటుంబాల మధ్య బంధంగా పరిగణిస్తున్నారు.. అందుకే లావెండర్ మ్యారేజ్ జరుగుతుంది. ఎవరికి అనుమానం రాకుండా.. సదరు వ్యక్తి ఇష్టానికి వ్యతిరేకంగా శృంగారంలో పాల్గొనడానికి దారి తీస్తుంది. కొన్ని సందర్భాల్లో సాన్నిహిత్యం క్షీణించి.. అపనమ్మకం ఏర్పడుతుంది. సమాజం కోసం చేసుకున్న ఇదే పెళ్లికి హాని కలుగుతుంది. ఆ పెళ్లితో ముడిపడిన రెండు జీవితాలు విడిపోతున్నాయి.



Source link

Related posts

ప్రపంచంలోని రోబోల్లోనే అత్యంత అందగత్తె… MISS AI

Oknews

టూరిస్టులను ట్రాప్ చేసిన గూగుల్ మ్యాప్స్.. ఎక్కడికి చేర్చిందో చూస్తే షాక్..

Oknews

రోబోట్స్‌తో రొమాన్స్.. భావోద్వేగాలు, భావప్రాస్తి కూడా సాధ్యమేనట..

Oknews

Leave a Comment