EntertainmentLatest News

‘లియో’కి జరిగిన తప్పు రజినీ 171కి జరగదంటున్న లోకేష్‌!


‘మానగరం’ చిత్రంతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన లోకేష్‌ కనగరాజ్‌.. ఖైదీ, మాస్టర్‌, విక్రమ్‌ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో టాప్‌ డైరెక్టర్స్‌ లిస్ట్‌లో చేరిపోయాడు. ఆ తర్వాత విజయ్‌తో చేసిన ‘లియో’పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఏర్పడ్డాయి. అయితే ఆశించిన స్థాయిలో ఆ సినిమా లేదని ఫ్యాన్స్‌ ఫీల్‌ అయ్యారు. ఎందుకంటే ‘లియో’ లోకేష్‌ స్టైల్‌లో కాకుండా విజయ్‌ స్టైల్‌లో ఉంది. విజయ్‌కి ఉన్న స్టార్‌ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని తన మార్క్‌ని పక్కన పెట్టాడన్న విమర్శలు అప్పట్లో బాగా వినిపించాయి. అవేవీ పట్టించుకోకుండా రజినీకాంత్‌ 171 సినిమాను స్టార్ట్‌ చేసేశాడు లోకేష్‌. ఈమధ్యకాలంలో వచ్చిన రజినీ సినిమాల్లో తలైవర్‌ 171పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రజినీని లోకేష్‌ ఎలా ప్రజెంట్‌ చెయ్యబోతున్నాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ ఇటీవల విడుదలైంది. ఆ పోస్టర్‌ని చూసి కథ ఎలా వుండబోతోంది అనే విషయంలో రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు నెటిజన్లు. 

దీనిపై స్పందించిన లోకేష్‌ తలైవర్‌ 171కి తప్పకుండా ప్రత్యేకత ఉంటుందని చెబుతున్నాడు. లియో చిత్రంపై వచ్చిన కామెంట్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా ఖచ్చితంగా తన స్టైల్‌లోనే ఉంటుంది అంటున్నాడు. అందరూ ఊహించినట్టుగా ఈ సినిమా కథ ఉండదని, అలాగే రజినీని ఈ సినిమాలో చాలా కొత్త ప్రజెంట్‌ చెయ్యబోతున్నానని ప్రామిస్‌ చేస్తున్నాడు. ఈ సినిమా కథ అయినా, రజినీ స్టైల్‌ అయినా హండ్రెడ్‌ పర్సెంట్‌ తన స్టైల్‌లోనే ఉంటుందట. అంతేకాదు, తన గత చిత్రాల్లో చూపించిన విధంగా ఈ సినిమాలో డ్రగ్స్‌కి ప్రాధాన్యం ఇవ్వడం లేదని స్పష్టం చేస్తున్నాడు. ఏది ఏమైనా లోకేష్‌ మాటలు విన్న తర్వాత ఈసారి ఒక కొత్త రజినీకాంత్‌ని ఈ సినిమాలో చూడబోతున్నామని అభిమానులు ఎంతో హ్యాపీగా ఫీల్‌ అవుతున్నారు. 



Source link

Related posts

కేఏ పాల్ పార్టీలో చేరిన బాబూ మోహన్.!

Oknews

పాన్ ఇండియా హీరో తేజ సజ్జ మరో సంచలనం!

Oknews

Telugu States telangana Andhra Pradesh Hopes on Interim Budget 2024

Oknews

Leave a Comment