విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ రూపొందించిన ‘మాస్టర్’ కోలీవుడ్‌లో ఘనవిజయం సాధించింది. ఈ సినిమా తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా తమ కాంబినేషన్‌లో ‘లియో’ చిత్రాన్ని స్టార్ట్ చేశారు. పాన్ ఇండియా సినిమాగా అక్టోబర్ 19న రిలీజ్ కానుంది, సెవన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై ఎస్.ఎస్.లలిత్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఈ సినిమాలో విజయ్‌ను ఓ డిఫరెంట్ లుక్‌లో చూపించాడు లోకేష్. విజయ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో యాక్షన్ పార్ట్‌ను చాలా అద్భుతంగా చిత్రీకరించారు. విజయ్ చెప్పే డైలాగులకు థియేటర్స్‌లో విజిల్స్ మోగడం ఖాయం. ఇక హీరోయిన్‌గా నటించిన త్రిష సెంటిమెంట్ సీన్ కూడా ట్రైలర్‌లో పొందుపరిచారు. సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ మీనన్ క్యారెక్టర్స్ సినిమాకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. సినిమాలో వీరి క్యారెక్టర్స్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉందని ట్రైలర్‌లోనే అర్థమైంది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, అనిరుధ్ మ్యూజిక్ హైలైట్‌గా ఉన్నాయి. మొత్తానికి ట్రైలర్ మాత్రం అదరగొట్టాడు లోకేష్. విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో మరో బ్లాక్‌బస్టర్ పక్కా అనే రేంజ్‌లో ట్రైలర్ ఉంది.