కమల్ హాసన్ అంటే విలక్షణమైన కథానాయకుడు. తను చేసే క్యారెక్టర్ కోసం ఏం చెయ్యడానికైనా సిద్ధపడే ఏకైక నటుడు. ఇక మణిరత్నం ఒక క్లాసిక్ డైరెక్టర్. తను చేసే ప్రతి సినిమా ఒక క్లాసిక్ అనడంలో అతిశయోక్తి లేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో 1987లో వచ్చిన ‘నాయకన్’ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా విడుదలై 35 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇద్దరూ కలిసి మరో సినిమా చెయ్యలేదు. ఈ ఇద్దరు లెజెండ్స్ కలిసి మళ్ళీ సినిమా చేస్తే.. ఇది నిజంగా సినిమా అభిమానులకు పెద్ద శుభవార్తే అవుతుంది. ‘నాయకన్’ ఘనవిజయం తర్వాత మళ్ళీ కమల్‌హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో మరో గొప్ప సినిమా వస్తుందని అందరూ ఎదురుచూశారు… కాదు.. 35 ఏళ్ళుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఈ కాంబోలో మరో సినిమా చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇది కమల్ హాసన్ చేస్తున్న 234వ సినిమా కావడం విశేషం.
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, రెడ్ జెయింట్ మూవీస్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్‌హాసన్, మణిరత్నం, ఆర్.మహేంద్రన్, శివఅనంత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, అన్బరీవ్ యాక్షన్, రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ హైలైట్స్‌గా ఈ సినిమా రూపొందనుంది. 2024 లో విడుదల కానున్న ఈ సినిమాలో నయనతార, జయం రవి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తుండగా, సినిమాలోని ఒక ముఖ్యమైన చిన్న పాత్రలో బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ గానీ, తమిళ్‌లో ఓ రేంజ్ హీరోగా పేరు తెచ్చుకున్న అజిత్‌గానీ నటించే అవకాశం ఉంది.