Top Stories

లేఖలతో ఊరుకుంటే అది జగన్ ఫెయిల్యూర్!


కృష్ణా జలాల పంపిణీ వ్యవహారంలో కేటాయింపుల పునస్సమీక్ష కోసం కేంద్రప్రభుత్వం గెజిట్ కూడా విడుదల చేసిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వపు అచేతనత్వం ప్రశ్నార్థకం అవుతోంది. ఇలాంటి పునస్సమీక్ష కోసం తెలంగాణ చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తుండగా.. కేంద్రం తాజాగా ఈ పునస్సమీక్ష బాధ్యతను బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు అప్పగించింది. దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కేంద్రానికి ఒక లేఖ రాశారు. 

తాజాగా అధికారులతో ఈ విషయంపై సమావేశం నిర్వహించిన ఆయన.. మరోసారి ప్రధానికి, హోంమంత్రికి కూడా లేఖ రాద్దామని సూచించారు. అయితే కేవలం లేఖలకు పరిమితమై ఊరుకోవడం అనేది జగన్ సర్కారు ఫెయిల్యూర్ అవుతుందనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. కేంద్రం పట్ల జగన్ అనుసరించే సానుకూల ధోరణి కొందరి మెతక వైఖరిగా అనిపించినా నష్టం లేదు. కానీ, దానివలన రాష్ట్రప్రయోజనాలు భంగపడితే మాత్రం.. అది నష్టదాయకమని పలువురు భావిస్తున్నారు.

నిజానికి, కేంద్రం తీసుకువచ్చిన గెజిట్ మీద సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసే అంశం గురించి చర్చించడానికి సీఎం జగన్ నీటిపారుదల శాఖ అధికారులు, న్యాయనిపుణులతో భేటీ అయ్యారు. ఈ గెజిట్ ద్వారా కేంద్రం చట్టాన్ని ఏ రకంగా ఉల్లంఘించినదో అధికారులు ముఖ్యమంత్రికి చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు.

రాష్ట్ర విభజనకు ముందు జరిగిన కేటాయింపులకు కట్టుబడి ఉండాలని, పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 చెబుతుంది. అయితే దానికి భిన్నంగా కేంద్రం పునస్సమీక్షించడానికి నిర్ణయం తీసుకుంది. అలాగే సుప్రీం కోర్టులో అనేక పిటిషన్లు పెండింగులో ఉండగా.. గెజిట్ ఇవ్వకూడదనే అంశాన్ని కూడా నిపుణులు సీఎం దృష్టికి తెచ్చారు. 2002 ముందు ట్రైబ్యునల్ చేసిన కేటాయింపులు, నీటి పంపకాలను తిరిగి పరిశీలంచకూడదని చెబుతున్న చట్టాన్ని కూడా పేర్కొన్నారు.

ఇలాంటి నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సుప్రీం కోర్టును ఆశ్రయించి.. కృష్ణాజలాల కేటాయింపులను పునస్సమీక్షించే ప్రయత్నాలను ఆపుదల చేయించడం ఒక్కటే సబబైన పరిష్కారం. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం మరోసారి ప్రధానికి, హోం మంత్రికి లేఖలు రాద్దాం అని చెప్పడం.. సాగతీత ధోరణికి నిదర్శనమనే విమర్శలు వస్తున్నాయి. దీనివలన.. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలుగుతుంది. 

లేఖకు స్పందించే వారయితే.. ఇప్పుడు రాసిన లేఖతోనే పని జరిగేది కదా అని పలువురి వాదన. లేఖ రాయడం ఓకే గానీ.. ఆ మిషపై సుప్రీంలో పిటిషన్ వేయకుండా జాగు చేస్తే కష్టమని పలువురు అంటున్నారు.



Source link

Related posts

ప‌వ‌న్‌పై నోరెత్త‌ని ష‌ర్మిల‌…!

Oknews

ఆ హీరోయిన్ కు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు

Oknews

మొన్న శ్రద్ధా కపూర్.. నేడు పూజా హెగ్డే

Oknews

Leave a Comment