Health Care

లేటెస్ట్ రెసిపీ.. బెండకాయతో సమోసా.. ఎలా చేశారో చూసేద్దామా


దిశ, ఫీచర్స్ : ఈ మధ్యకాలంలో చాలామంది ఫుడ్ కోర్టులు పెట్టుకుని వింత వింత వంటలు ప్రయోగాలు చేసుకుంటూ ఉంటున్నారు. అంతే కాదు ప్రయోగాలు చేసిన వింత వంటలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. పింక్ బిర్యాణి, స్వీట్ సమోసా, బ్లూ సమోసా లాగా ఈ మధ్య కాలంలో ఓ వెరైటీ సమోసా తెగ వైరల్ అవుతోంది. ఈ బెండీ సమోసా చూడటానికి ఓ మోస్తరులో ఉన్న రుచి ఎలా ఉందో టేస్ట్ చూసిన వారికే తెలుసు. ఇంతకీ ఈ సమోసా ఎక్కడ తయారు చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

సాయంత్రం టీ అండ్ స్నాక్స్ సమయంలో తినేందుకు ఇష్టపడే స్నాక్స్ సమోసా. ఎందుకంటే మన దేశంలో ప్రజలు సమోసాల పై చాలా ప్రేమను కురిపిస్తారు. దీని పేరు వినగానే నోట్లో లాలాజలం అలా ఊరుతుంది. తినాలనే కోరిక మనసులో పుడుతుంది. అయితే ఈ మద్య కాలంలో తయారు చేసే సమోసాలను చూస్తే నోరూరడం మాట పక్కన పెడితే దాన్ని చూడగానే ఆకలి కూడా చచ్చిపోతుంది. అలాంటి ఒక సమోసానే భేండీ సమోసా..

ఒక బండి పై భేండీ సమోసాను విక్రయిస్తున్న విక్రేతను ఈ వీడియోలో చూడవచ్చు. బెండీ సమోసాను తన చేతిలోకి తీసుకున్న వెంటనే, దానిలోని పూరకాన్ని బహిర్గతం చేయడానికి అతను దానిని పగలగొట్టాడు. అందులో బంగాళాదుంపలకు బదులుగా మసాలా భిండి కనిపించింది. దీనితో పాటు సమోసాలు బంగాళదుంప, బఠాని కూర, గ్రీన్ చట్నీతో వడ్డించారు. చివరగా కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి తినడానికి వడ్డిస్తారు. ఈ సమోసా ధర ఒక్కో ప్లేట్ రూ. 30గా పేర్కొంది. ఈ క్లిప్ instaలో foodi_ish అనే ఖాతా ద్వారా షేర్ చేశారు.

Read More..

ఓట్స్ మసాలా వడలు ఈ విధంగా తయారు చేసుకోండి  





Source link

Related posts

మీకు ఈ 3 అలవాట్లు ఉన్నాయా.. మీ ప్రియురాలు మిమ్మల్ని వదులుకోలేదు..

Oknews

యువతలోనూ అధిక రక్తపోటు.. ముందుగా గుర్తించకపోతే గనుక..

Oknews

బ్లేడు అంచులపై నడిచినా గాయపడని ఒకే ఒక్క జీవి.. ఏదంటే?

Oknews

Leave a Comment