దిశ, ఫీచర్స్: రాత్రి తొందరగా పడుకుని ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. ఎర్లీ మార్నింగ్ నిద్రలేచిన వాళ్లు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మనలో నిగూఢమైన ఉన్న సానుకూలమైన అంతర్గత ఆలోచనలు మెరుగుపడతాయి. మార్నింగ్ లేచి నిశ్శబ్ద టైం లో ధ్యానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
అలాగే మన శరీరంలో ఉండే బయో క్లాక్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. దీంతో నిద్ర నాణ్యత వేగంగా మెరుగుపడుతుంది. ఉదయాన్నే సూర్యకాంతి బాడీ పై పడడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీంతో వైరల్ వ్యాధుల ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. ఉదయం పూట లేస్తే ఇన్ని ప్రయోజానాలున్నాయని తెలియక చాలామంది ఆలస్యంగా నిద్ర లేచి ఎన్నో సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారు ఎలాంటి వ్యాధుల బారిన పడతారో తాజాగా నిపుణులు వెల్లడించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
* మార్నింగ్ లేట్‌గా లేవడం వల్ల మధుమేహం బారిన పడతారు. దీంతో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్‌కు కారణమవుతుంది.
* మలబద్ధకం, పైల్స్ సమస్యలు వస్తాయి.
* జీర్ణక్రియ నెమ్మదిస్తుంది
* గుండె జబ్బులు వస్తాయి.
* ఊబకాయం వల్ల జీవక్రియలో వేగం తగ్గి కొత్త రోగాలు తలెత్తుతాయి.
* ఒత్తిడి, చిరాకు వస్తుంది.
* కొంతమంది నైట్ షిప్ట్ డ్యూటీ చేసి.. తెల్లవారుజామున ఆలస్యంగా లేస్తారు. ఇలాంటి వారికి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు.