దిశ, ఫీచర్స్: మన వంటగదిలో నిత్యం ఉండే మసాలా దినుసులలో ఇంగువ ఒకటి. అవి లేకుంటే కూరకు రుచి, వాసన కూడా ఉండదు. ఇది కూరల రుచిని పెంచడం కోసం ఉపయోగిస్తారు. వివిధ ఆరోగ్య సమస్యలకు ఇంగువ కూడా మేలు చేస్తుంది. ఇంగువ అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది, అందుకే భారతీయ వంటకాల్లో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు.
పాత కాలం నుంచి ఆయుర్వేద చికిత్సలలో ఇంగువను ఉపయోగిస్తున్నారు. ఇది మన జీర్ణవ్యవస్థను బలపరుస్తాయి అనేక కడుపు సమస్యల నుండి ఉపశమనం పొందుతాయి. చిన్నపిల్లలకు అజీర్తి చేసినప్పుడు ఇంగువను అరగదీసి ఆ పేస్టును కడుపులో పట్టిస్తారు. అంటే కడుపులోని గ్యాస్ సులభంగా పోతుంది. అందుకే మనం కూరల్లో ఇంగువ వాడతాం. అంతే కాకుండా రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇంగువ గుండె సమస్యలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతే కాదు, ఇది ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలకు కూడా ఔషధంగా పనిచేస్తుంది. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది. పొడి దగ్గు, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు తమ ఆహారంలో ఇంగువను చేర్చుకోవడం ద్వారా వారి లక్షణాల నుండి ఉపశమనం పొందవచ్చు. ఇంగువ రుతుక్రమంలో వచ్చే నొప్పుల నుండి కూడా ఉపశమనం కలిగిస్తాయి. రుతుక్రమంతో బాధపడేవారు కొన్ని ఎండిన ఇంగువను వేడి నీళ్లలో కలుపుకుంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.