హిట్ సినిమాకి సీక్వెల్ వస్తుందంటే.. ఆడియన్స్ లోనూ, ట్రేడ్ సర్కిల్స్ లోనూ క్రేజ్ ఉండటం సహజం. హీరో రామ్ పోతినేని (Ram Pothineni), డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్ లో వస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ (Double iSmart)పై కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ కి తగ్గట్టుగానే భారీగా బిజినెస్ జరుగుతోంది.
రామ్-పూరి కాంబోలో 2019 లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ వస్తోంది. ఆగష్టు 15న విడుదల కానున్న ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. థియేటర్లలో సరైన మాస్ బొమ్మ పడి చాలా రోజులైంది. పక్కా కమర్షియల్ సినిమా వస్తే.. థియేటర్లలో రచ్చ చేయాలని మాస్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ లోటుని భర్తీ చేయడం కోసమే అన్నట్టుగా ‘డబుల్ ఇస్మార్ట్’ రెడీ అవుతోంది. ఇక బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతోంది. ఇప్పటికే థియేట్రికల్ రైట్స్ ఏకంగా రూ.60 కోట్లకు అమ్ముడైనట్లు టాక్. ఇక సౌత్ భాషల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని రూ.33 కోట్లకు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోగా.. ఆడియో రైట్స్ రూ.9 కోట్లకు అమ్ముడయ్యాయట. అంటే హిందీ డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ కలపకుండానే.. ఇప్పటికే వంద కోట్లకు పైగా బిజినెస్ చేసింది. మరి ఈ భారీ బిజినెస్ కి తగ్గట్టే.. ‘డబుల్ ఇస్మార్ట్’ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.