పీకేపై వైసీపీ నేతలు ఫైర్
ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రశాంత్ కిషోర్ ఏమైనా మాయల ఫకీరా అని ఎద్దేవా చేస్తున్నారు. బిహార్ లో రాజకీయ పార్టీ పెట్టి, వివిధ పార్టీలకు పొలిటికల్ ఎనలిస్ట్ గా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ కు ఏపీ రాజకీయాలతో సంబంధం ఏంటని మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలకు ఎల్లో మీడియా విస్తృత ప్రచారం కల్పించి ప్రజలను ఏమార్చేందుకు ప్రయత్నిస్తుందన్నారు. మంత్రి అంబటి సైతం పీకే కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. గతంలో లగడపాటి కూడా ఏపీ ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పారని, ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్నారన్నారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సైతం ఏపీ ఎన్నికల ఫలితాలపై తప్పుడు జోస్యం చెప్పి సన్యాసానికి సిద్ధంగా ఉన్నారంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.