Telangana

వచ్చే ఐదేళ్లలో కోటి మంది మ‌హిళ‌ల‌ను కోటీశ్వరుల‌ను చేస్తాం- సీఎం రేవంత్ రెడ్డి-secunderabad news in telugu cm revanth reddy started mahalakshmi mahila sakhti scheme interest free loans ,తెలంగాణ న్యూస్



ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలనే ఇందిరమ్మ ఇండ్లురాష్ట్రంలోని మహిళా సంఘాల్లో 63 లక్షల మంది సభ్యులుని, రానున్న రోజుల్లో కోటి మంది మహిళలు చేరాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కోటి మందిని కోటీశ్వరులను చేస్తే మన రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా మహిళా ప్రగతికి విధాన పత్రం విడుదల చేశారు. లక్ష మంది ఆడబిడ్డలతో సమావేశం ఏర్పాటు చేయాలని 48 గంటల ముందు చెబితే మీరంతా హాజరై మహిళా శక్తిని నిరూపించారు. మీ శక్తి మీద నాకు నమ్మకం ఉంది. నెల రోజుల్లో మహాలక్ష్మిలకు షాపులను ఏర్పాటు చేసి వాటి చట్టబద్ధత కల్పించి పూర్తి స్థాయి వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. మీ కష్టాలను చూసే ఆడబిడ్డలకు అండగా నిలవాలన్న లక్ష్యంతోనే ఆరు గ్యారెంటీలను(Congress Six Guarantees) తీసుకొచ్చామని గుర్తుచేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇచ్చే గృహజ్యోతి పథకం(Gruhajyothi), ఆరోగ్యశ్రీ(Aarogya Sri) పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం, ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలని ఇందిరమ్మ ఇండ్లు(Indiramma Housing), వారి కన్నీళ్లు తుడవాలని రూ. 500లకే గ్యాస్‌ సిలిండర్‌ అందించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు సీఎం వివరించారు. వచ్చే ఐదేళ్లలో ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే బాధ్యత ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.



Source link

Related posts

two months free coaching for sc candidates for ts dsc aspirants

Oknews

KCR Expiry Medicine CM Revanth Reddy Chit Chat With Media

Oknews

TS TET 2024 Detailed Notificationa and Information Bulletin released government has increased tet fee | TS TET 2024: ‘టెట్’ అభ్యర్థులకు షాకిచ్చిన రేవంత్ సర్కార్, ఫీజులు భారీగా పెంపు

Oknews

Leave a Comment