జగదీష్ రెడ్డి జైలుకే!నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూం ఇండ్ల వరకు అన్ని హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదన్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. జగదీష్ రెడ్డి చావు తప్పి కన్ను లొట్టపోయి గెలిచారన్నారు. ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేని అసమర్థుడు జగదీష్ రెడ్డి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముగ్గురుని హత్య చేసిన కేసులో జగదీష్ రెడ్డి నిందితుడని ఆరోపణలు చేశాడు. రేపో మాపో జగదీష్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమన్నారు. కోవర్టు అంటూ తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడటం వెస్ట్ అంటూ మంత్రి ఫైర్ అయ్యారు. జగదీష్ రెడ్డికి సూర్యాపేట కలెక్టరేట్ చుట్టూ 150 ఎకరాల భూములు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. 80 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఎలా కట్టారన్నారు.
Source link
previous post