దిశ, ఫీచర్స్ : దేశంలో మరోసారి పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. వివాహ వేడుకల్లో స్నేహితుల సందడి ఎక్కువగా ఉంటుంది. పెళ్లిలో స్నేహితులు లేకపోతే సరదాలు, నవ్వులు అస్సలు ఉండవు. స్నేహితులు కూడా తమాషా చేసే అవకాశాన్ని వదులుకోరు. ఎంతో సరదాగా సాగిపోయే వివాహ వేడుకల్లో కొన్ని ఫన్నీ మూమెంట్స్ కూడా జరుగుతుంటాయి. ఇలాంటి ఫన్నీ వీడియోలు ఖచ్చితంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఈ వీడియోలను చూసిన వారు కడుపుబ్బా నవ్వుకుంటారు. అలాంటి ఒక వీడియోనే ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో వధూవరులకు స్నేహితులు వేదిక పై బహుమతులు ఇచ్చారు. ఇద్దరూ కలిసి ఆ బహుమతిని తెరుస్తూనే ఉన్నారు. చాలా సేపటి తరువాత వార్తాపత్రికలో చుట్టిన బహుమతి బయటికి వచ్చింది. ఆ బహుమతిని చూసిన అక్కడి వారందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇంతకీ ఆ బహుమతి ఏమిటంటే రెండు లాలీపాప్ లు ఉన్నాయి. గిఫ్ట్ ఓపెన్ చేసిన నవదంపతులు ఒకరికి ఒకరు స్నేహితులు ఇచ్చిన లాలీపాప్ లను తినిపించుకున్నారు.