EntertainmentLatest News

వరకట్న వేధింపులవల్లనే  ఆ నటి పెళ్లి చేసుకోవడం లేదు..


 

హీరోలకే కాదు హీరోయిన్లుకి  కూడా అభిమానులు ఉంటారు అని చెప్పిన అతి కొద్దీ మంది హీరోయిన్లలో  నిత్యామీనన్ కూడా ఒకరు. తను ఎంత మంచి యాక్టరో అంతే మంచి సింగర్ కూడా. అలాగే తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగు లో సొంతంగా తన క్యారక్టర్ కి డబ్బింగ్ చెప్పుకొని నిత్య అంటే మన తెలుగు అమ్మాయే అనేలా  తెలుగు ఆడియన్స్ లో పేరు సంపాదించుకుంది. తాజాగా నిత్య మీనన్ కి  పెళ్ళికి సంబంధించిన న్యూస్ ఒకటి నెట్టింట హల్ చల్  చేస్తుంది. నిత్య మీనన్ ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉందో నాకు తెలుసు అని  ఒక వ్యక్తి చెప్పడం దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తుంది.

కొన్ని సంవత్సరాల క్రితం మలయాళ చిత్ర సీమకి చెందిన ఒక పేరు మోసిన నటీమణికి వివాహం జరిగింది. ఆ తర్వాత ఆ నటీమణిని ఎక్కువ కట్నం కోసం  మెట్టినింటివాళ్ళు వేధించడంతో ఆ నటీమణి ఆత్మ హత్య చేసుకొని చనిపోయింది. నిత్య మీనన్ ఈ వార్త విన్నప్పటి నుంచి తను కూడా పెళ్లి చేసుకుంటే వరకట్నం,గృహహింస వేధింపులకు గురి కావలసి వస్తుందేమోననే భయం పట్టుకుందని అందుకే తను పెళ్లి చేసుకోవడం లేదు అని అతను చెప్పుకొచ్చాడు. అలాగే తను బాగా లావుగా ఉండటం వలన కూడా పెళ్ళికి ఒప్పుకోవడం లేదు అని అతను చెప్పాడు.ఈ విషయాలన్నీ  చెప్పిన వ్యక్తి ప్రముఖ తమిళ నటుడు ,సినీ విమర్శకుడు అయిన బైల్వ రంగనాధన్.  అతను చెప్తున్న వాటిల్లో నిజం ఎంతో  అబద్దం ఎంతో తెలియాలంటే నిత్యామీననే చెప్పాలి.

నిత్య మీనన్  అతి తక్కువ కాలంలోనే ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి మంచి హీరోయిన్ గా గుర్తింపుని పొందింది. నిత్యామీనన్ తెలుగులో ఎన్టీఆర్, అల్లు అర్జున్, నితిన్, అలాగే తమిళంలో విజయ్, ధనుష్, లారెన్స్ లాంటి హీరో ల పక్కన నటించింది.అలాగే ఎంత పెద్ద హీరో అయిన తన క్యారక్టర్ కి ప్రాధాన్యమున్న సినిమాల్లోనే నిత్య మీనన్ నటిస్తుంది.  తాజాగా నిత్య మీనన్  కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్  ద్వారా  తన నటనతో ప్రేక్షకులని అలరిస్తు  ఉంది. ప్రముఖ ఓటిటి సంస్థలో హిట్ టాక్ తో ఆ వెబ్ సిరీస్ ముందుకు దూసుకుపోతుంది. 



Source link

Related posts

Krish Jagarlamudi attend drugs case inquiry డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన క్రిష్

Oknews

Ustaad Bhagat Singh is here ఉస్తాద్ భగత్ సింగ్ ఊపిరి పోసాడు

Oknews

Will Stars smile? పేరు మార్చుకున్న మెగా హీరో

Oknews

Leave a Comment