EntertainmentLatest News

వరుణ్ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన సూర్యాపేట ఫ్యాన్స్..126 అడుగుల కట్ అవుట్


మెగా ప్రిన్స్ గా అభిమానులందరి చేత పిలిపించుకునే వరుణ్ తేజ్ ఈ రోజుతో 34  సంవత్సరాల్ని పూర్తి చేసుకొని 35 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు.తన పుట్టిన రోజు కానుకగా  తన నూతన చిత్రం మట్కా నుంచి  ఫస్ట్ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసి  తన ఫ్యాన్స్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు. కానీ ఇప్పుడు  వరుణ్ కి ఫ్యాన్స్ అదిరిపోయే  గిఫ్ట్ ని రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇప్పుడు ఈ విషయం వైరల్ గాను మారింది.

వరుణ్ తేజ్ పుట్టిన రోజుని పురస్కరించుకొని తెలంగాణలోని సూర్యాపేట కి చెందిన వరుణ్ అభిమానులు 126 అడుగుల భారీ కటౌట్ ని ఏర్పాటు చేశారు. వరుణ్ నుంచి రాబోతున్న ఆపరేషన్ వాలెంటైన్ మూవీలోని స్టిల్ తో ఉన్న వరుణ్ కట్ అవుట్ ని ఫ్యాన్స్ ఏర్పాటు చెయ్యడం విశేషం. ఇప్పుడు ఈ విషయం టాక్ అఫ్ ది తెలుగు స్టేట్స్ అయ్యింది.

రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా వరుణ్ పుట్టిన రోజు వేడుకల్ని ఫ్యాన్స్ చాలా  ఘనంగా జరిపారు. అలాగే వరుణ్ నుంచి రాబోయే అన్ని చిత్రాలు కూడా విజయాలు సాధించి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో   వరుణ్ తన కంటు ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటుచేసుకోవాలని  కూడా ఫ్యాన్స్ అభిలషిస్తున్నారు. వరుణ్ తాజా చిత్రం ఆపరేషన్ వాలెంటైన్  ఫిబ్రవరి 16 న విడుదల కాబోతుంది. 

 



Source link

Related posts

Double iSsmart OTT deal set? డబుల్ ఇస్మార్ట్ ఓటీటీ డీల్ సెట్టయ్యిందా?

Oknews

Congress Will Come To Power In December, TPCC President Revanth Reddy

Oknews

ITR 2024 Income Tax ITR Filing For FY 2023 24 Check These Changes In It Return Forms

Oknews

Leave a Comment