Entertainment

వరుణ్‌ ‘గాండీవధారి అర్జున’ ఇక ఇంటికి వచ్చేసింది!


వరుణ్‌తేజ్‌, ప్రవీణ్‌ సత్తారు కాంబినేషన్‌లో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మించిన ‘గాండీవధారి అర్జున’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందిన ఈ సినిమా విడుదలైన నెలకే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తోందనగానే ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెరిగింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్‌ అయింది. అయితే ప్రవీణ్‌ సత్తారు గతంలో చేసిన ‘గరుడవేగ’ చిత్రంలాగ ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. 

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం ‘గాండీవధారి అర్జున’ చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ జరుగుతోంది. ఈ సినిమాలో వరుణ్‌తేజ్‌ సరసన సాక్షి వైద్య నటించింది. థియేటర్స్‌లో ప్రేక్షకులను అలరించలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఇంటికి వచ్చేసింది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఇప్పుడు అందుబాటులో ఉంది. మరి ఓటీటీలో ఈ సినిమా ఏమేర ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుందో చూడాలి. 



Source link

Related posts

చిరంజీవి  చేతుల మీదుగా  నారా రోహిత్, టీవీ 5 మూర్తిల విధ్వంసం 

Oknews

‘విడాముయర్చి’ షూటింగ్‌లో విషాదం.. అజిత్‌ ఆత్మీయ ఆర్ట్‌ డైరెక్టర్‌ మృతి!

Oknews

నేరుగా ఓటీటీలోకి అక్కినేని హీరో మూవీ!

Oknews

Leave a Comment