ByGanesh
Thu 26th Oct 2023 08:48 PM
వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు పెళ్లి పీటలెక్కేందుకు సర్వం సిద్ధం అయింది. ఇటలీలో టుస్కనీలో జరగబోయే డెస్టినేషన్ వెడ్డింగ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు పెళ్లి వేడుకలు కోసం ఇటలీ బయలుదేరారు. హైదరాబాద్ లోనే పెళ్లి షాపింగ్ చేసిన వరుణ్-లావణ్యలు ప్రముఖ బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైనర్ వేర్ లో పెళ్లి దుస్తులని సెలక్ట్ చేసుకుని అవుట్ ఫిట్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో ఫైనల్ ట్రైల్స్ చేసుకుని వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అలాగే మెగా ఫ్యామిలిలో వరుణ్-లావణ్యల ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ తో పాటుగా.. లావణ్య త్రిపాఠి తన ఫ్రెండ్స్ తో బ్యాచులర్స్ పార్టీని గ్రాండ్ గా చేసుకుంది. అదలాఉంటే అసలు వరుణ్ తేజ్-లావణ్యల వివాహానికి ముహూర్తం కానీ, దానికి సంబందించిన వెడ్డింగ్ కార్డ్ కానీ ఇంతవరకు బయటికి రాలేదు. అయితే ఇప్పుడు వరుణ్-లావణ్యల వెడ్డింగ్ కార్డ్ లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వరుణ్ పెళ్లి నవంబర్ 1 న ఇటలీలోని టుస్కనీ నగరంలో జరగబోతుంది. వరుణ్-లావణ్యల మొదటి ఇంగ్లీష్ లెటర్ V, L పేర్లని ప్రముఖంగా డిజైన్ చేసారు.
వరుణ్ తేజ్ తాతగారు-నాన్నమల పేర్ల మీదుగా కార్డ్ ని అచ్చు వేయించారు.. కింద చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పేర్లని ఉంచారు. పెళ్లి ఇటలీలో టుస్కనీలో నవంబర్ 1 న జరుగుతుండగా.. రిసెప్షన్ మాత్రం హైదరాబాద్ లోనే జరపనున్నట్లుగా ఆ కార్డ్ లో ముద్రించారు. హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లో రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుంది అంటూ ఆ కార్డ్ లో మెన్షన్ చేసారు. ప్రస్తుతం మెగా పెళ్లి కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Varun Tej-Lavanya wedding card has gone viral:
Varun Tej – Lavanya Tripathi wedding invitation card goes viral