Top Stories

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. గ్రాండ్ రిసెప్షన్


డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. అదే టైమ్ లో లోకల్ గా గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు, కొంతమంది మెగాభిమానులకు, జనసేన పార్టీ కీలక సభ్యులకు ఆహ్వానాలు అందించారు వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వెడ్డింగ్ రిసెప్షన్ నవంబర్ 5వ తేదీన జరగనుంది. ఆ రోజు ఆదివారం. హైదరాబాద్ లోని ఎన్-కన్వెన్షన్ లో ఈ రిసెప్షన్ ను భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు.

మరో 4 రోజుల్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లితో ఒకటి కాబోతున్నారు. ఇటలీలో వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తాజాగా వరుణ్-లావణ్య ఇటలీ బయల్దేరి వెళ్లారు. వీళ్లతో పాటు నిహారిక కూడా వెళ్లింది. మరో 2 రోజుల్లో మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఇటలీ వెళ్తున్నారు.

ఇలా పూర్తిగా కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకోబోతున్నాడు వరుణ్ తేజ్. పెళ్లయిన 4 రోజులకే తిరిగి ఇండియా వచ్చి, 5వ తేదీన గ్రాండ్ గా రిసెప్షన్ ఇస్తున్నాడు.

పెళ్లి కోసం తన చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తిచేశాడు వరుణ్ తేజ్. రిసెప్షన్ పూర్తయిన తర్వాత చేతిలో ఉన్న ఆపరేషన్ వాలంటైన్ సినిమా డబ్బింగ్ పనుల్లో జాయిన్ అవుతాడు. డిసెంబర్ 8న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. మరోవైపు మట్కా సినిమా షూటింగ్ ను వరుణ్ స్టార్ట్ చేయాల్సి ఉంది.



Source link

Related posts

శృతిహాసన్ చేతికి సమంత సినిమా

Oknews

పవన్ సినిమా క్వాలిటీ లేదా.. హరీష్ ఏమంటున్నాడు?

Oknews

రాహుల్ పై బిజెపి అనైతిక, లేకి ప్రచారం!

Oknews

Leave a Comment